శ్రీలంక : ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) మహిళా వన్డే వరల్డ్ కప్ మెగా టోర్నీ కొనసాతోంది. తొలి మ్యాచ్ లో భారత మహిళా జట్టు శ్రీలంకను 59 పరుగుల తేడాతో ఓడించింది. ఇక రెండో మ్యాచ్ తన చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ జట్టుతో తలపడనుంది టీమిండియా. అయితే ఇండియాలో , పాకిస్తాన్ లో కాకుండా ఇరు జట్లు తటస్థ వేదికగా శ్రీలంకలోని కొలంబో వేదికగా మ్యాచ్ జరగనుంది. ప్రస్తుతం ఈ వరల్డ్ కప్ హాట్ ఫెవరేట్ గా ఇంగ్లండ్, ఆస్ట్రేలియా జట్లు ఉన్నాయి. మరో వైపు ఆసియా కప్ ఇటీవలే ముగిసింది దుబాయ్ వేదికగా. భారత పురుషుల జట్టు ఛాంపియన్ గా నిలిచింది. దాయాది పాకిస్తాన్ పై 5 వికెట్ల తేడాతో ఓడించింది. ఈసందర్బంగా కప్ తీసుకునేందుకు ఆసియా క్రికెట్ కౌన్సిల్ చైర్మన్ నుంచి నిరాకరించింది భారత జట్టు.
మరో వైపు పహల్గామ్ దాడి ఘటన వెనుక పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు ఉన్నట్లు కేంద్ర సర్కార్ ఆరోపించింది. ఈ మేరకు వారికి నివాళిగా పాకిస్తాన్ జట్టుతో మ్యాచ్ లు ఆడతాం కానీ వారితో కరచాలనం చేసేందుకు మాత్రం ఒప్పుకునేది లేదంటూ ప్రకటించారు. ఈ విషయాన్ని బీసీసీఐ ఇప్పటికే స్పష్టం చేసింది కూడా. మరో వైపు ఆసియా కప్ ఇవ్వకుండానే ఇబ్బందికి గురి చేసిన ఏసీసీ, పీసీబీ చైర్మన్ నఖ్వీపై సీరియస్ అయ్యింది ఐసీసీ. వెంటనే కప్ ఇవ్వాలని ఆదేశించింది. ఇదిలా ఉండగా ఇవాళ భారత మహిళా జట్టు, పాకిస్తాన్ జట్టుతో ఆడనుంది. ఈ సందర్బంగా ఎలాంటి షేక్ హ్యాండ్స్ అంటూ ఉండవని స్పష్టం చేసింది.
