Indira Krishnan : నటి ఇందిరా కృష్ణన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వంగా సందీప్ రెడ్డి దర్శకత్వం వహించిన యానిమల్ చిత్రంలో తను తల్లిగా నటించింది. ఇందులో రణ బీర్ కపూర్ తో పాటు రష్మిక మందన్నా, అనిల్ కపూర్ కూడా కీ రోల్స్ పోషించారు. ఇందులో బాబీ డియోల్ ను విలన్ గా చూపించాడు. ఆ ఒక్క మూవీ బాబీకి ఊహించని అవకాశాలు వచ్చేలా చేశాయి. ఈ మూవీ బాలీవుడ్ లో రికార్డ్ బ్రేక్ చేసింది. ఏకంగా రూ. 1000 కోట్లను వసూలు సాధించింది. తాజాగా వంగా సందీప్ రెడ్డి పాన్ ఇండియా హీరో డార్లింగ్ ప్రభాస్ తో స్పిరిట్ తీస్తున్నాడు. ఇందులో హీరోయన్ గా త్రిప్తి దిమ్రీని ఎంపిక చేశాడు. యానిమల్ చిత్రంలో తల్లి పాత్రను పోషించింది అద్భుతంగా ఇందిరా కృష్ణన్.
Indira Krishnan Comments
ఇదే సమయంలో ప్రస్తుతం రణ బీర్ కపూర్ , నేచురల్ నటి సాయి పల్లవితో కలిసి రామాయణం మూవీలో నటిస్తున్నారు. ఈ మూవీలో కూడా ఇందిరా కృష్ణన్ (Indira Krishnan) మదర్ పాత్రను పోషించింది. ఈ సందర్బంగా స్పందించింది తన పాత్ర గురించి. జీవితంలో మరిచి పోలేని అనుభవంగా మిగిలి పోతుందన్నారు. ఇది ఒక రకంగా విశ్వంతో కనెక్ట్ అయ్యేలా చేస్తోందన్నారు. యానిమల్ చిత్రంలో నటించి ఈ ఏడాదితో 2 ఏళ్లు పూర్తవుతుందని చెప్పారు. రామాయణంతో తన కల మరోసారి సాకారమైందని, ఇది మరింత సంతోషం కల్పిస్తోందన్నారు ఇందిరా కృష్ణన్.
రణ బీర్ కపూర్ తో షూటింగ్ అంటేనే మరింత ఆనందంగా కలుగుతోందన్నారు. తను జోవియల్ గా ఉంటాడని తెలిపింది. అసలు చిత్రీకరణ జరిగినట్లే అనిపించదని చెప్పింది. తాజాగా తను చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి.
Also Read : Hero Vijay Deverakonda : దేవరకొండ నటనకు రష్మిక మందన్నా ఫిదా

















