Stock Market : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన అదనపు సుంకాలు భారతీయ మార్కెట్లపై గణనీయ ప్రభావం చూపుతున్నాయి. భారత ఎగుమతులపై సుంకాలను 25% పెంచి 50%కు చేర్చిన చర్య బుధవారం నుంచి అమల్లోకి రావడంతో, గురువారం మార్కెట్‌లో (Stock Market) భారీ అమ్మకాలు చోటుచేసుకున్నాయి.
Stock Market – సూచీల పతనం
బీఎ్‌సఈ సెన్సెక్స్ గురువారం 705.97 పాయింట్లు పడిపోయి 80,080.57 వద్ద ముగిసింది. నిఫ్టీ కూడా 211.15 పాయింట్లు కోల్పోయి 24,500.90 స్థాయికి చేరుకుంది. సెన్సెక్స్‌లో లిస్ట్ అయిన 30 కంపెనీలలో 23 నష్టపోయాయి.
వినాయక చవితి సందర్భంగా బుధవారం మార్కెట్ మూసివేయబడింది. అయితే, రెండు రోజుల (మంగళవారం, గురువారం) ట్రేడింగ్ సెషన్లలోనే సెన్సెక్స్ 1,555.34 పాయింట్లు, నిఫ్టీ 466.85 పాయింట్లు పడిపోయాయి. ఈ క్రమంలో బీఎ్‌సఈలో నమోదిత కంపెనీల మొత్తం మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.9.69 లక్షల కోట్లు క్షీణించి రూ.445.17 లక్షల కోట్లకు చేరుకుంది.
అత్యధికంగా దెబ్బతిన్న రంగాలు
ట్రంప్ సుంకాల ప్రభావంతో ఎగుమతి ఆధారిత రంగాలు తీవ్రంగా నష్టపోయాయి. ముఖ్యంగా టెక్స్‌టైల్స్, రొయ్యలు, తోలు-పాదరక్షలు, జెమ్స్ అండ్ జువెలరీ రంగాలు భారీ ఒత్తిడిని ఎదుర్కొన్నాయి.
టెక్స్‌టైల్స్ కంపెనీలు
- కిటెక్స్ గార్మెంట్స్ – -5.0%
- పర్ల్ గ్లోబల్ – -2.94%
- సియారామ్ సిల్క్ మిల్స్ – -2.56%
- రేమండ్ లైఫ్‌స్టైల్ – -2.37%
- అలోక్ ఇండస్ట్రీస్ – -1.59%
- రూప అండ్ కంపెనీ – -1.43%
- వెల్‌స్పన్ లివింగ్ – -1.09%
- ట్రైడెంట్ లిమిటెడ్ – -1.01%
రొయ్యల రంగం
- అపెక్స్ ఫ్రోజెన్ ఫుడ్స్ – -5.36%
- వాటర్‌బేస్ లిమిటెడ్ – -3.38%
- అవంతి ఫీడ్స్ – -0.82%
- తోలు, పాదరక్షలు
- ఖదీమ్ ఇండియా – -1.95%
- రిలాక్సో ఫుట్‌వేర్ – -1.84%
- మయూర్ యూనికోటర్స్ – -0.83%
- సూపర్‌హౌస్ లిమిటెడ్ – -0.56%
- మీర్జా ఇంటర్నేషనల్ – -0.50%
జెమ్స్ & జువెలరీ
- బ్లూస్టోన్ జువెలరీ – -3.51%
- స్కై గోల్డ్ అండ్ డైమండ్స్ – -3.23%
- శాంతి గోల్డ్ – -3.05%
- త్రిభువన్దాస్ భీమ్‌జీ జవేరీ – -0.84%
- రాజేశ్ ఎక్స్‌పోర్ట్స్ – -0.37%
Also Read : RC Bhargava Shocking Comments : ట్రంప్ బెదిరింపులకు భారత్ తలవంచొద్దు



















