India : ముంబై : అమ్మాయిలు చరిత్ర సృష్టించారు. తొలిసారిగా ప్రపంచ వన్డే కప్ ను ముద్దాడారు. తమకు ఎదురే లేదని చాటారు. ముంబై వేదికగా బీవై పాటిల్ స్టేడియంలో దక్షిణాఫ్రికా మహిళా జట్టుతో జరిగిన ఫైనల్ లో సత్తా చాటారు. మూడుసార్లు భారత్ (India) ఫైనల్ కు వెళ్లింది. కానీ చేజిక్కించుకోలేక పోయింది. ఈ టోర్నీలో 7 సార్లు ఛాంపియన్ గా నిలిచిన ఆస్ట్రేలియా జట్టుకు ఝలక్ ఇచ్చింది సెమీస్ లో. హర్మన్ ప్రీత్ కౌర్ సారథ్యంలో భారత జట్టు విశ్వ విజేతగా నిలిచింది. ముందుగా బ్యాటింగ్ చేసిన భారత జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 298 పరుగులు చేసింది. షెఫాలీ వర్మ, దీప్తి శర్మలు అద్భుతమైన భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఈ ఇద్దరు హాఫ్ సెంచరీలతో హోరెత్తించారు. ఇదే సమయంలో లక్ష్య ఛేదనలో సఫారీ జట్టు ప్రదర్శించిన పోరాటం చెప్పుకోవాల్సింది. ప్రధానంగా ఆ జట్టు కెప్టెన్ లారా వోల్వార్ట్ అద్భుతంగా ఆడింది. కెప్టెన్ అంటే ఇలా ఉండాలని ఆడి చూపించింది.
India Women Cricket Team Victory
అయినా దీప్తి శర్మ, షెపాలీ వర్మల బౌలింగ్ దెబ్బకు సఫారీలు కంగారెత్తి పోయారు. కోట్లాది భారతీయుల ఆశలను సజీవంగా ఉంచుతూ భారత అమ్మాయిలు సాగించిన పోరాటం చిరస్మరణీయం అని చెప్పక తప్పదు. ముంబై స్టేడియంలో 42 వేల మందికి పైగా హాజరయ్యారు. దిగ్గజ క్రికెటర్లు సైతం మ్యాచ్ ను చూసేందుకు విచ్చేశారు. యావత్ భారతమంతా కళ్లప్పగించి చూసింది ఈ ఫైనల్ మ్యాచ్ ను. ఉమెన్ ఇన్ బ్లూ సమిష్టిగా ఆడి చరిత్ర సృష్టించింది. ప్రపంచ కప్ ను కైవసం చేసుకుంది. సగర్వంగా ముద్దాడింది. 299 పరుగుల లక్ష్యం చేదించే క్రమంలో దక్షిణాఫ్రికా 45.3 ఓవర్లలోనే చాప చుట్టేసంది. 246 పరుగులకు ఆలౌట్ అయ్యింది.
Also Read : INDW vs SAW – India Victory : టీమిండియా విశ్వ విజేత
