Marco Rubio Shocking Comments : అమెరికా సంబంధాల‌లో ఇండియా టాప్

విదేశాంగ శాఖ కార్య‌ద‌ర్శి మార్కో రూబియో

Hello Telugu - Marco Rubio Shocking Comments

Hello Telugu - Marco Rubio Shocking Comments

Marco Rubio : అమెరికా : సుంకాల విష‌యంలో గ‌త కొంత కాలంగా నెల‌కొన్న ఉద్రిక్త‌త ప‌రిస్థితుల త‌రుణంలో ఉన్న‌ట్టుండి అమెరికా త‌న వాయిస్ ను మార్చ‌డం విస్తు పోయేలా చేసింది. ప్ర‌ధానంగా అమెరికా విదేశాంగ శాఖ ముఖ్య కార్య‌ద‌ర్శి మార్కో రూబియో (Marco Rubio) కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. అమెరికా సంబంధాలలో అగ్రస్థానంలో భారతదేశం ఉంద‌ని ప్ర‌క‌టించారు. ఇది శుభ ప‌రిణామ‌మ‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. ఇదే క్ర‌మంలో కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయ‌ల్ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. వ‌చ్చే నవంబ‌ర్ నెలాఖ‌రు నాటికి భార‌త్, అమెరికా దేశాల మ‌ధ్య వాణిజ్య ప‌ర‌మైన ఒప్పందాలు చేసుకోవ‌డం జ‌రుగుతుంద‌ని వెల్ల‌డించారు. ప్రపంచంలో అమెరికా కలిగి ఉన్న అత్యున్నత సంబంధాలలో భారతదేశం ఒకటి అని పేర్కొన్నారు మార్కో రూబియో. ఢిల్లీతో ఆ సంబంధంలో వాషింగ్టన్ అసాధారణ పరివర్తన కాలంలో ఉందని అన్నారు.

Marco Rubio Key Comments on India-US Relations

సెనేట్ విదేశాంగ సంబంధాల కమిటీలో తన నిర్ధారణ విచారణలో భారతదేశంలో అమెరికా రాయబారిగా నియమితుడైన సెర్గియో గోర్‌ను పరిచయం చేశారు రూబియో. గోర్ గురించి చాలా కాలంగా తనకు తెలుసునని చెప్పారు. అయితే అమెరికా ఇత‌ర దేశాల‌తో సంబంధాల కంటే భార‌త దేశంతోనే ఎక్కువ బంధం క‌లిగి ఉంద‌న్నారు. ఇదిలా ఉండ‌గా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రెసిడెన్షియల్ పర్సనల్ డైరెక్టర్ గోర్‌ను భారతదేశంలో తదుపరి అమెరికా రాయబారిగా, దక్షిణ, మధ్య ఆసియా వ్యవహారాల ప్రత్యేక రాయబారిగా పదోన్నతి కల్పిస్తున్నట్లు ప్రకటించారు. 38 ఏళ్ల గోర్ భారతదేశంలో అతి పిన్న వయస్కుడైన అమెరికన్ రాయబారి అవుతారని చెప్పారు.

Also Read : Infosys Buyback Sensational : 18000 కోట్ల షేర్లను మార్కెట్ నుంచి కొనుగోలు చేయనున్న ఇన్ఫోసిస్

Exit mobile version