టి20 టీమిండియా కెప్టెన్ గా శ్రేయ‌స్ అయ్య‌ర్

వైస్ కెప్టెన్ గా తెలుగు కుర్రాడు తిల‌క్ వ‌ర్మ

hellotelugu-TeamIndiaSquad

ముంబై : భార‌త క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) సెలెక్ష‌న్ క‌మిటీ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేసింది. భార‌త జ‌ట్టుకు వ‌రుస‌గా రెండుసార్లు టి20 వ‌ర‌ల్డ్ క‌ప్ లు అందించిన ముంబైకి చెందిన స్టార్ ప్లేయ‌ర్ సూర్య కుమార్ యాద‌వ్ ను ప‌క్క‌న పెట్టింది. శ‌నివారం ఐర్లాండ్ జ‌ట్టుతో ఆడే టి20 సీరీస్ కోసం జ‌ట్టును ప్ర‌క‌టించింది. ఇందుకు సంబంధించి మీడియాకు వివ‌రాలు వెల్ల‌డించ‌చాడు జ‌ట్టు హెడ్ కోచ్ గౌత‌మ్ గంభీర్. సూర్య కుమార్ యాద‌వ్ జ‌ట్టు కెప్టెన్సీ నుంచే కాదు ఏకంగా జ‌ట్టు నుంచి కూడా తొల‌గించ‌డం జ‌ర‌గ‌డం విస్తు పోయేలా చేసింది. ఇక హైద‌రాబాద్ కు చెందిన తెలుగు కుర్రాడు తిల‌క్ వ‌ర్మ‌కు వైస్ కెప్టెన్సీ ప‌ద‌వి ద‌క్కింది.

యంగ్ వండ‌ర్ కిడ్ బీహార్ కు చెందిన వైభ‌వ్ సూర్య వంశీకి టి20 జ‌ట్టులో ప్లేస్ ద‌క్కింది. ఇక జ‌ట్టు ప‌రంగా చూస్తే శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్) కాగా అభిషేక్ శర్మ‌, సంజు శాంస‌న్ , ఇషాన్ కిష‌న్ , శివ‌మ్ దూబే, తిలక్ వ‌ర్మ (వైస్ కెప్టెన్), నితీష్ కుమార్ రెడ్డి, అక్షర్ ప‌టేల్ , వాషింగ్ట‌న్ సుందర్, వరుణ్ చ‌క్ర‌వ‌ర్తి, ర‌వి బిష్ణోయ్, మ‌హ‌మ్మ‌ద్ సిరాజ్, హర్షిత్ రాణా, అర్ష్‌దీప్, ప్రిన్స్, వైభవ్ సూర్యవంశ్ ఉన్నారు. సరిగ్గా రాణించకపోవడంతో రింకు సింగ్ తన స్థానాన్ని కోల్పోయాడని తెలిపాడు గౌతం గంభీర్. ఐపీఎల్ సీజన్ లో అద్బుతమైన ప్ర‌ద‌ర్శ‌న చేసిన ప్రిన్స్ యాద‌వ్ కు చోటు క‌ల్పించామ‌న్నారు.

Exit mobile version