IND vs WI : అహ్మదాబాద్ : గుజరాత్ లోని అహ్మదాబాద్ స్టేడియం వేదికగా జరిగిన కీలకమైన తొలి టెస్టులో భారత జట్టు అద్భుత విజయాన్ని నమోదు చేసింది. వెస్టిండీస్‌ను ఇన్నింగ్స్ 140 పరుగుల తేడాతో ఓడించింది. హైదరాబాద్ స్టార్ పేసర్ సిరాజ్ మరోసారి తళుక్కున మెరిశాడు. ఆధిపత్య విజయంతో భారత్ టెస్ట్ సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో నిలిచింది. నరేంద్ర మోడీ స్టేడియంలో భారతదేశం (India), వెస్టిండీస్ మధ్య జరిగిన మొదటి టెస్ట్ క్రికెట్ మ్యాచ్ ముగిసింది. స్పిన్నర్ రవీంద్ర జడేజా నాలుగు వికెట్లు పడగొట్టడంతో గెలుపు ఖాయమైంది. తొలి ఇన్నింగ్స్ లో భారత జట్టుకు చెందిన ముగ్గురు ఆటగాళ్లు సెంచరీలతో కదం తొక్కారు. వీరిలో కేఎల్ రాహుల్ , ధ్రువ్ జురైల్ , రవీంద్ర జడేజా ఉన్నారు.
IND vs WI Test Match Updates
మ్యాచ్ లో భాగంగా తొలి ఇన్నింగ్స్ లో వెస్టిండీస్ ను 162 పరుగులకే కట్టడి చేసింది టీమ్ ఇండియా. అనంతరం బరిలోకి దిగిన భారత జట్టు 5 వికెట్లు కోల్పోయి 448 పరుగులు చేయగా ఆ వెంటనే కెప్టెన్ ఇన్నింగ్స్ ను డిక్లేర్ చేస్తున్నట్లు ప్రకటించాడు. అనంతరం భారీ టార్గెట్ తో మైదానంలోకి దిగిన వెస్టిండీస్ ను పూర్తిగా కట్టడి చేసింది. 146 పరుగులకే ఆలౌట్ చేసింది. దీంతో రెండు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో నిలిచింది టీమ్ ఇండియా. సిరాజ్ తో పాటు జడేజా , కుల్దీప్ యాదవ్ సూపర్ ష చేశారు. బౌలింగ్ తో ఆకట్టుకున్నారు. ప్రత్యర్థులను తక్కువ స్కోర్ కే కట్టడి చేశారు.
Also Read : Popular Cricketer Shubman Gill : వన్డే జట్టు కెప్టెన్ గా శుభ్ మన్ గిల్
