IND vs SL : దుబాయ్ : ఆసియా కప్ 2025 మెగా టోర్నీ చివరి అంకానికి చేరుకుంది. ఇంకా కొన్ని గంటలు మాత్రమే మిగిలి ఉన్నాయి విజేత ఎవరో తేలేందుకు. ఇప్పటికే టోర్నీ నుంచి నిష్క్రమించిన శ్రీలంక జట్టు భారత్ తో జరిగిన సూపర్ ఫోర్ మ్యాచ్ లో మాత్రం చుక్కలు చూపించింది. చివరకు మ్యాచ్ టైగా ముగిసింది. కానీ సూపర్ ఓవర్ లో భారత జట్టు విక్టరీ నమోదు చేసింది. ఈ టోర్నీలో ఏ ఒక్క మ్యాచ్ ఓడి పోకుండా ఇండియా నేరుగా ఫైనల్ కు చేరుకుంది. ఇక ఇప్పటికే బంగ్లాదేశ్ ను ఓడించిన పాకిస్తాన్ తో తలపడనుంది దుబాయ్ వేదికగా.
Asia Cup 2025 IND vs SL Updates
ఇక మ్యాచ్ విషయానికి వస్తే భారత జట్టు దుమ్ము రేపింది. నిర్ణీత 20 ఓవర్లలో 202 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది శ్రీలంక ముందు. ఎప్పటి లాగే దంచి కొట్టాడు అభిషేక్ శర్మ. 51 బంతులు ఎదుర్కొని 61 రన్స్ చేశాడు. తిలక్ వర్మ 49 పరుగులతో రాణించగా సంజూ శాంసన్ 39 పరుగులతో మెరిశాడు. ఇందులో ఒక ఫోర్ 3 సిక్స్ లు ఉన్నాయి. శ్రీలంక జట్టులో నిస్సాంక సూపర్ సెంచరీ చేశాడు. 58 బంతులు ఎదుర్కొని 7 ఫోర్లు 6 సిక్సర్లతో రెచ్చి పోయాడు. 107 రన్స్ చేశాడు. పెరెరా 32 బంతులు ఆడి 58 రన్స్ చేశాడు ఇందులో 8 ఫోర్లు 1 సిక్స్ ఉన్నాయి. ఇరు జట్లు సమానంగా నిలిచాయి. సూపర్ ఓవర్ లో శ్రీలంక 3 రన్స్ చేయగా భారత్ ఆ టార్గెట్ ను చేదించింది.
Also Read : Huge Rains – MGBS Flooded : భారీ వర్షం నీట మునిగిన ఎంజీబీఎస్



















