IND vs SL : దుబాయ్ : దుబాయ్ వేదికగా జరుగుతున్న ఆసియా కప్ (Asia Cup 2025) ఆఖరు అంకానికి చేరుకుంది. నిన్న జరిగిన కీలక పోరులో బంగ్లాదేశ్ జట్టుపై పాకిస్తాన్ 11 రన్స్ తేడాతో గెలుపొందింది. ఆసియా కప్ మెగా టోర్నీ ఫైనల్ కు చేరుకుంది. ఇప్పటికే ఏ ఒక్క మ్యాచ్ ఓడి పోకుండా సూర్య కుమార్ యాదవ్ సారథ్యంలోని టీమిండియా ముందుగా ఫైనల్ కు చేరుకుంది. మరోవైపు ప్రత్యర్థి దాయాది పాకిస్తాన్ జట్టును రెండుసార్లు ఓడించింది. ఇటు బ్యాటింగ్ లో అటు బౌలింగ్ లో సత్తా చాటింది. దీంతో ఫైనల్ మరింత రసవత్తరంగా మారింది. ఇరు జట్లు ముచ్చటగా మూడోసారి తలపడేందుకు సిద్దమయ్యాయి.
IND vs SL Match Today
ఇక ఆసియా కప్ టోర్నీలో ఇప్పటికే శ్రీలంక జట్టు ఎలిమినేట్ అయ్యింది. అయితే సూపర్ 4కు సంబంధించి లీగ్ మ్యాచ్ భారత జట్టుతో శుక్రవారం ఆడాల్సి ఉంది. ఇప్పటికే ఫైనల్ కు చేరుకున్న టీమిండియా ఈ మ్యాచ్ ను లైట్ గా తీసుకుంది. అయితే భారత జట్టు హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ పూర్తిగా ప్రయోగాలు చేపట్టేందుకు సిద్దమయ్యారని సమాచారం. అభిషేక్ శర్మ, శుభమన్ గిల్, పాండ్యా, తదితర ఆటగాళ్లు కీలకంగా మారనున్నారు. బౌలింగ్ పరంగా కుల్దీప్ యాదవ్ సూపర్ షో తో ఆకట్టుకున్నాడు. ఈ మ్యాచ్ ప్రాధాన్యత సంతరించక పోయినా సీరియస్ గా తీసుకోనుంది టీమిండియా. ఇప్పటి వరకు టోర్నీలో జరిగిన మ్యాచ్ లలో దూరంగా ఉన్న ఆటగాళ్లను శ్రీలంకతో ఆడించనున్నారు.
Also Read : Pakistan Asia Cup 2025 Final list : ఆసియా కప్ ఫైనల్ కు పాకిస్తాన్
