IND vs PAK Asia Cup 2025 Victory : టీమిండియా ఆసియా క‌ప్ విజేత

దాయాది పాకిస్తాన్ కు బిగ్ షాక్

Hello Telugu - IND vs PAK Asia Cup 2025 Victory

Hello Telugu - IND vs PAK Asia Cup 2025 Victory

Asia Cup 2025 : దుబాయ్ : దుబాయ్ వేదిక‌గా జరిగిన ఆసియా కప్ 2025 (Asia Cup 2025) ఫైన‌ల్ లో భార‌త జ‌ట్టు పాకిస్తాన్ ను ఓడించింది. విజేతగా నిలిచింది. సూర్య కుమార్ యాద‌వ్ నేతృత్వంలోని టీమిండియా ఈ టోర్నీలో జైత్ర‌యాత్ర కొన‌సాగించింది. భార‌త్ చేతిలో వ‌రుస‌గా మూడోసారి ఓట‌మి పాలైంది పాకిస్తాన్. టాస్ గెలిచి ముందుగా ఫీల్డింగ్ ఎంచుకున్నాడు స్కిప్ప‌ర్. నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో ప్ర‌త్యర్థి జ‌ట్టు 146 ప‌రుగుల‌కే ఆల్ అవుట్ అయ్యింది. భార‌త బౌల‌ర్ల‌లో మ‌రోసారి స‌త్తా చాటాడు కుల్దీప్ యాద‌వ్. త‌ను టోర్నీలో 17 వికెట్లు తీశాడు. ఈ మ్యాచ్ లో 4 వికెట్లు తీసి పాకిస్తాన్ ప‌త‌నాన్ని శాసించాడు. త‌న‌కు తోడుగా అక్ష‌ర్ ప‌టేల్ కూడా తోడ‌య్యాడు.

IND vs PAK Asia Cup 2025 Final Updates

ఈ మ్యాచ్ ఎప్ప‌టి లాగే దాయాదుల మ‌ధ్య ఉత్కంఠ భ‌రిత పోరు కొన‌సాగింది. నువ్వా నేనా అన్న రీతిలో సాగినా చివ‌ర‌కు తెలుగు కుర్రాడు తిల‌క్ వ‌ర్మ సూప‌ర్ షోతో ఇండియా ఛాంపియ‌న్ గా నిలిచింది.
147 ప‌రుగుల ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగిన భార‌త్ కు ఆదిలోనే చుక్కెదురైంది. దుమ్ము రేపిన అభిషేక్ శ‌ర్మ నిరాశ ప‌రిచాడు. మ‌రోసారి విఫ‌లం అయ్యారు శుభ్ మ‌న్ గిల్ , సూర్య కుమార్ యాద‌వ్. 21 ప‌రుగుల‌కే 3 వికెట్లు కోల్పోయిన త‌రుణంలో జ‌ట్టును ఆదుకున్నారు తిల‌క్ వ‌ర్మ‌, సంజూ శాంస‌న్. తిల‌క్ 53 బంతుల్లో 69 ప‌రుగులు చేసి నాటౌట్ గా నిల‌వ‌గా రింకూ సింగ్ సిక్స్ కొట్టి ఇండియాకు విజ‌యాన్ని చేకూర్చి పెట్టాడు. శాంస‌న్ 24 ర‌న్స్ చేస్తే శివ మ్ దూబే 33 ప‌రుగుల‌తో రాణించారు.

Also Read : Pak Navratri Interesting Update : పాకిస్తాన్ లో అంగరంగ వైభవంగా నవరాత్రి ఉత్సవాలు

Exit mobile version