IND vs PAK Asia Cup Sensational : దాయాదుల పోరుపై ఎడ‌తెగ‌ని ఉత్కంఠ

ఇండియా వ‌ర్సెస్ పాకిస్తాన్ జ‌ట్ల మ్యాచ్

Hello Telugu - IND vs PAK Asia Cup Sensational

Hello Telugu - IND vs PAK Asia Cup Sensational

IND vs PAK : దుబాయ్ : ఆసియా క‌ప్ 2025 మెగా టోర్న‌మెంట్ నిర్వ‌హ‌ణ‌కు అంతా సిద్ద‌మైంది . దుబాయ్ వేదిక‌గా ఇది జ‌ర‌గ‌నుంది. ఇప్ప‌టికే ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) ఆధ్వ‌ర్యంలో భారీ ఎత్తున ఏర్పాట్లు చేశారు. గ‌తంలో కంటే ఈసారి ప్రైజ్ మ‌నీ కూడా పెంచారు. విచిత్రం ఏమిటంటే బీసీసీఐ (BCCI) కార్య‌దర్శిగా ఉన్న అమిత్ షా త‌న‌యుడు జే షానే ఏసీసీకి, ఇంట‌ర్నేష‌న‌ల్ క్రికెట్ కౌన్సిల్ కు చైర్మ‌న్ గా ఉన్నారు. ఈ త‌రుణంలో ఇటీవ‌ల భార‌త దేశం ఊహించ‌ని రీతిలో పాకిస్తాన్ పై ఆప‌రేష‌న్ సింధూర్ పేరుతో దాడికి పాల్ప‌డింది. దీంతో ఇరు దేశాల మ‌ధ్య ఉద్రిక్త‌త ప‌రిస్థితులు నెల‌కొన్నాయి. గ‌త కొంత కాలంగా పాక్ (Pakistan), భార‌త్ (Bharat) జ‌ట్ల మ‌ధ్య త‌మ త‌మ స్వంత దేశాల‌లో ఆడిన దాఖ‌లాలు లేవు. 2012 నుంచి ఇరు జ‌ట్లు త‌ట‌స్త వేదిక‌ల మీద మాత్ర‌మే ఆడుతున్నాయి. త‌ల ప‌డుతున్నాయి.

IND vs PAK Asia Cup Sensational

ఇండియా పాకిస్తాన్ వెళ్లేందుకు భార‌త మోదీ ప్ర‌భుత్వం ఒప్పుకోలేదు. ఇదిలా ఉండ‌గా సెప్టెంబ‌ర్ 9వ తేదీ నుంచి ఆసియా క‌ప్ ప్రారంభం అవుతుంది. ఇప్ప‌టికే అన్ని జ‌ట్లు దుబాయ్ కి చేరుకున్నాయి. ఫుల్ ప్రాక్టీస్ లో మునిగి పోయాయి. భార‌త క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) సెలెక్ష‌న్ క‌మిటీ చైర్మ‌న్ అజిత్ అగార్క‌ర్ ఇప్ప‌టికే జ‌ట్టును ప్ర‌క‌టించారు. సూర్య కుమార్ యాద‌వ్ ను స్కిప్ప‌ర్ గా, గిల్ ను వైస్ కెప్టెన్ గా నియ‌మించారు. ఇక సూప‌ర్ ఫామ్ లో కొన‌సాగుతున్న సంజూ శాంస‌న్ ను తుది జ‌ట్టుకు ఎంపిక చేస్తారా లేదా అన్న‌ది తేలాల్సి ఉంది. దీనిపై ఉత్కంఠ నెల‌కొంది. ఇప్ప‌టి వ‌ర‌కు క్లారిటీ ఇచ్చే ప్ర‌య‌త్నం చేయ‌లేదు హెడ్ కోచ్ గౌత‌మ్ గంభీర్. కాగా పాకిస్తాన్ , ఇండియా జ‌ట్ల మ‌ధ్య జ‌ర‌గ‌బోయే కీల‌క మ్యాచ్ పై ఉత్కంఠ నెల‌కొంది.

Also Read : Director Anuparna Roy Success : ఉత్త‌మ ద‌ర్శ‌కురాలిగా అనుప‌ర్ణ రాయ్

Exit mobile version