Kuldeep Yadav : దుబాయ్ : ఆసియా కప్ 2025 ఛాంపియన్ గా నిలిచింది టీమిండియా. సూర్య కుమార్ సారథ్యంలోని భారత జట్టు సగర్వంగా కప్ ను తీసుకుంది. తాము నిజమైన ఛాంపియన్లమని నిరూపించింది. అంతే కాదు స్కిప్పర్ ఇప్పటికే ప్రకటించినట్టు దాయాది పాకిస్తాన్ జట్టు తమకు పోటీనే కాదన్నాడు. అన్నట్టుగానే ఆచరణలో చేసి చూపించాడు. జట్టు కూటమిగా రాణించింది. సత్తా చాటింది. అటు బౌలింగ్ లోను ఇటు బ్యాటింగ్ లోను సత్తా చాటింది. విజేతగా అవతరించింది. ఆసియా కప్ లో తనకు ఎదురే లేదని చాటింది. ప్రధానంగా భారత జట్టుకు చెందిన కుల్దీప్ యాదవ్ (Kuldeep Yadav) అద్భుతమైన బౌలింగ్ తో ఆకట్టుకున్నాడు.
Kuldeep Yadav Bowling
తన ప్రాధాన్యత ఏమిటో బీసీసీఐకి చూపించాడు. సూపర్ షోతో ప్రత్యర్థులకు చుక్కలు చూపించాడు. ఒకానొక దశలో 200 రన్స్ చేస్తుందని అనుకున్న పాకిస్తాన్ ఆశలపై నీళ్లు చల్లాడు. అద్భుతమైన స్పెల్ తో బోల్తా కొట్టించాడు. మ్యాచ్ పరంగా చూస్తే తొలుత బ్యాటింగ్ చేసింది పాకిస్తాన్ . నిర్ణీత 20 ఓవర్లు ఆడకుండానే చాప చుట్టేసింది. ఒకానొక దశలో పవర్ ప్లేలో దంచి కొట్టిన పాక్ కుల్దీప్ దెబ్బకు ఠారెత్తి పోయంది. తను ఏకంగా 4 వికెట్లు తీశాడు. దాయాది జట్టు పతనాన్ని శాసించాడు. మొత్తంగా ఈ టోర్నీలో 7 మ్యాచ్ లు ఆడిన కుల్దీప్ యాదవ్ మొత్తం 17 వికెట్లు తీశాడు. తనకు ఎదురే లేదని చాటాడు.
Also Read : Tilak Varma Sensational Match : పాకిస్తాన్ కు చుక్కలు చూపించిన తిలక్ వర్మ



















