IND vs ENG : ఇంగ్లండ్ – ఓవల్ వేదికగా జరుగుతున్న ఆఖరి 5వ టెస్టు రసవత్తరంగా మారింది. ఆతిథ్య జట్టు ముందు ఊహించని విధంగా భారత జట్టు భారీ లక్ష్యాన్ని ముందుంచింది. యశస్వి జైశ్వాల్ అద్భుతంగా రాణించాడు. సూపర్ షోతో ఆకట్టుకున్నాడు. మరోసారి సత్తా చాటాడు. సెంచరీతో కదం తొక్కాడు. దీంతో ఆతిథ్య జట్టు పై భారీ స్కోర్ ను ముందుంచింది. ఇంగ్లండ్ గెలవాలంటే 374 పరుగులు చేయాల్సి ఉంటుంది. అనంతరం మైదానంలోకి దిగిన ఆతిథ్య టీం ఒక వికెట్ కోల్పోయి 50 రన్స్ చేసింది. ఇక జట్టు విషయానికి వస్తే యశస్వి జైశ్వాల్ తో పాటు ఆకాశ్ , జడేజా, సుందర్ లు రాణించారు. మరోసారి కీలక ఇన్నింగ్స్ లు ఆడి జట్టుకు భారీ స్కోర్ రావడంలో తోడ్పడ్డారు.
IND vs ENG 5th Test Jaiswal
ఇప్పటికే 5 టెస్టుల సీరీస్ లో భాగంగా ఇంగ్లండ్ 2-1 తేడాతో ఆధిక్యంలో ఉంది. టీమిండియా 396 పరుగులు చేసింది. జైశ్వాల్ 164 బంతులు ఎదుర్కొని 14 ఫోర్లు 2 భారీ సిక్స్ లతో 118 రన్స్ చేశాడు. ఆకాశ్ దీప్ 94 బాల్స్ ఎదుర్కొని 66 పరుగగులు చేశాడు. ఇందులో 12 ఫోర్లు ఉన్నాయి. రవీంద్ర జడేజా అలియాస్ జడ్డూతో పాటు వాషింగ్టన్ సుందర్ లు చెరో 53 పరుగులు చేసి సత్తా చాటారు. ఇంగ్లండ్ బౌలర్లలో అద్భుతంగా బౌలింగ్ చేశాడు జోష్ టంగ్ మరోసారి. తను 125 పరుగులు ఇచ్చి కీలకమైన 5 వికెట్లు తీశాడు. అట్కిసన్ 127 రన్స్ ఇచ్చి 3 వికెట్లు కూల్చాడు. ఆ తర్వాత ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్ టీం 13.5 ఓర్లల ఒక వికెట్ కోల్పోయి 50 రన్స్ చేసింది.
Also Read : YS Jagan Fired on Police : పోలీసుల ఓవరాక్షన్ జగన్ సీరియస్



















