Asia Cup 2025 : దుబాయ్ : దుబాయ్ వేదికగా జరుగుతున్న ఆసియా కప్ 2025 (Asia Cup 2025) సూపర్ 4 లో భాగంగా జరిగిన కీలకమైన లీగ్ మ్యాచ్ లో సూర్య కుమార్ యాదవ్ సారథ్యంలోని భారత జట్టు జైత్రయాత్ర కొనసాగిస్తోంది. ఇప్పటి వరకు ఆడిన ప్రతి మ్యాచ్ లోను గలుపొందింది. తాజాగా బంగ్లాదేశ్ తో జరిగిన మ్యాచ్ లో దుమ్ము రేపింది. బ్యాటింగ్ లో, బౌలింగ్ లో సత్తా చాటింది. ఎప్పటి లాగే అభిషేక్ శర్మ దుమ్ము రేపాడు. మరోసారి హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్నాడు. తన దెబ్బకు బంగ్లా బౌలర్లు విల విల లాడారు. 41 పరుగుల తేడాతో గ్రాండ్ విక్టరీని నమోదు చేసింది ఇండియా. నేరుగా ఆసియా కప్ ఫైనల్ కు దూసుకు పోయింది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లోని దుబాయ్‌లోని దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో ముందుగా బ్యాటింగ్ చేసింది భారత్.
India Reach Asia Cup 2025 Finals
నిర్ణీత 20 ఓవర్లలో 169 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది ప్రత్యర్థి జట్టు ముందు. అనంతరం భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు నానా తంటాలు పడింది. చివరకు 19.3 ఓవర్లలోనే 127 పరుగులకే ఆలౌట్ అయ్యింది. ఇక సూపర్ 4 లో రెండు మ్యాచ్ లలో ఓటమి పాలైన శ్రీలంక టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఇక మరోసారి బంగ్లాదేశ్ , పాకిస్తాన్ జట్ల మధ్య జరిగే మ్యాచ్ లో ఎవరు గెలిస్తే ఆ జట్టుతో భారత జట్టు ఫైనల్ ఆడనుంది. భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్ మరోసారి మెరిశాడు. తను 18 రన్స్ ఇచ్చి 3 వికెట్లు తీశాడు. అఓర్ పటేల్ 37 రన్స్ ఇచ్చి ఒక వికెట్ తీస్తే వరుణ్ చక్రవర్తి 29 పరుగులు ఇచ్చి 2 వికెట్లు తీశాడు. భారత జట్టులో అభిషేక్ శర్మ 77 రన్స్ చేస్తే గిల్ 29 , పాండ్యా 38 పరుగులతో మెరిశారు. శివమ్ దూబే నిరాశ పరిచాడు.
Also Read : KTR Fired on Congress Govt : గిగ్ ప్లాట్ ఫారమ్ వర్కర్స్ పై వివక్ష తగదు



















