చెన్నై : తమిళనాడు టీవీకే సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. సీఎం జోసెఫ్ విజయ్ విద్యార్థులకు తీపి కబురు చెప్పారు. రాష్ట్రంలోని సామాజిక న్యాయ శాఖ హాస్టల్ విద్యార్థుల కోసం కేటాయింపుల పెంచుతున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు ప్రభుత్వ పరంగా సీఎస్ ఉత్తర్వులు జారీ చేసింది. ఇందుకు గాను పాఠశాల విద్యార్థుల సామాజిక న్యాయ శాఖ హాస్టళ్ల నిర్వహణ ఖర్చులు రూ. 50,000 నుండి రూ. 75,000కు, కళాశాల హాస్టళ్ల ఖర్చులు రూ. 50,000 నుండి రూ. 1 లక్షకు పెంచినట్లు స్పష్టం చేసింది. బీసీ , ఎంబీసీ సంక్షేమ శాఖ మంత్రి వి. సంపత్‌కుమార్ బీసీ, ఎంబీసీ హాస్టల్ విద్యార్థుల ఆహార ఖర్చులను , హాస్టళ్ల నిర్వహణ నిధులను పెంచుతున్నట్లు ప్రకటించారు. తన శాఖకు సంబంధించిన నిధుల కేటాయింపు డిమాండ్‌పై జరిగిన చర్చకు సమాధానం ఇచ్చారు. పాఠశాల హాస్టల్ విద్యార్థికి ఆహార ఖర్చు రూ. 1,400 నుండి రూ. 1,800కు, కళాశాల హాస్టల్ విద్యార్థికి రూ. 1,500 నుండి రూ. 2,000కు పెరుగుతుందని ఆయన తెలిపారు.
దీనివల్ల శాఖకు అదనంగా రూ. 32 కోట్ల భారం పడనుందని తెలిపారు మంత్రి. పాఠశాల హాస్టళ్ల నిర్వహణ ఖర్చులు రూ. 50,000 నుండి రూ. 75,000కు, కళాశాల హాస్టళ్ల ఖర్చులు రూ. 50,000 నుండి రూ. 1 లక్షకు పెరుగుతాయని ఆయన పేర్కొన్నారు. ఆధునిక సెలూన్ షాపులను ఏర్పాటు చేసుకునేందుకు 100 మందికి రూ. 1.5 లక్షల ఆర్థిక సహాయం అందించనున్నట్లు సంపత్‌కుమార్ తెలిపారు. అలాగే వెనుకబడిన , అత్యంత వెనుకబడిన వర్గాల విద్యార్థుల కోసం చెన్నైలో కొత్తగా ఒక సామాజిక న్యాయ శాఖ హాస్టల్‌ను ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. 14 హాస్టళ్లకు సొంత భవనాలు, 1,238 పాఠశాలలు , కళాశాల హాస్టళ్లలో దోమల తెరలు, అలాగే 960 హాస్టళ్లలో ఇన్వర్టర్, రిఫ్రిజిరేటర్ , వాటర్ ప్యూరిఫైయర్ సౌకర్యాలను కల్పించనున్నట్లు ఆయన ప్రకటించారు. 95 హాస్టళ్లకు కాంపౌండ్ వాల్స్ (చుట్టూ ప్రహరీ గోడలు) నిర్మాణం , 29 హాస్టళ్లను కళాశాల స్థాయి హాస్టళ్లుగా అప్‌గ్రేడ్ చేస్తామన్నారు.
