జాతీయ జ‌ట్టులోకి వైభ‌వ్ సూర్య‌వంశీని తీసుకోండి

బీసీసీఐకి సూచించిన ఎంపీ శ‌శి థ‌రూర్

hellotelugu-ShashiTharoor

ఢిల్లీ : కాంగ్రెస్ పార్టీకి చెందిన తిరువ‌నంత‌పురం ఎంపీ శ‌శి థ‌రూర్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. ఆయ‌న క్రీడా ప్రేమికుడు. అన్ని ఆట‌ల కంటే క్రికెట్ అంటే పిచ్చి త‌న‌కు. అందుకే వెంట‌నే స్పందిస్తాడు. త‌న మ‌న‌సులోని అభిప్రాయాల‌ను పంచుకుంటాడు. ఆ మ‌ధ్య‌న కేర‌ళ స్టార్ క్రికెట‌ర్ సంజూ శాంస‌న్ ను బీసీసీఐ ప‌ట్టించుకోక పోవ‌డం, సెలెక్ట‌ర్లు ప‌క్క‌న పెట్ట‌డాన్ని బ‌హిరంగంగానే త‌ప్పు ప‌ట్టాడు. ఆపై ఇలాంటి వివ‌క్ష వ‌ల్ల టాలెంట్ క‌లిగిన ఆట‌గాళ్ల‌కు అన్యాయం జ‌రుగుతుంద‌ని వాపోయాడు. గురువారం ఎక్స్ వేదిక‌గా మ‌రో కీల‌క కామెంట్స్ చేశాడు. ప్ర‌స్తుతం దేశీవాళి క్రికెట్ టోర్నీలో దుమ్ము రేపుతున్నాడు బీహార్ కు చెందిన క్రికెట‌ర్ వైభ‌వ్ సూర్య‌వంశీ. ప‌రుగుల వ‌ర‌ద పారించాడు. ఫోర్లు, సిక్స‌ర్ల‌తో దంచి కొడుతున్నాడు.

ఈ త‌రుణంలో స్పందించాడు ఎంపీ శ‌శి థ‌రూర్. వెంట‌నే త‌న‌ను జాతీయ జ‌ట్టులోకి తీసుకోవాల‌ని బీసీసీఐ సెలెక్ష‌న్ క‌మిటీకి సూచించాడు. ఎలాంటి ఫార్మాట్ లోనైనా రాణించే స‌త్తా త‌న‌కు ఉంద‌న్నాడు. ఇలాంటి ధైర్యం క‌లిగిన యంగ్ క్రికెట‌ర్ ను తీసుకుంటే జ‌ట్టుకు మ‌రింత ప్ర‌యోజ‌నం చేకూరే ఛాన్స్ ఉంటుంద‌ని అభిప్రాయ‌ప‌డ్డాడు శ‌శి థ‌రూర్. వైభవ్ సూర్యవంశి ప్రతిభను సచిన్ టెండూల్కర్‌తో పోల్చారు. అంతే కాకుండా త‌న‌ను అద్భుతమైన క్రికెట్ ప్రతిభావంతుడిగా ప్రశంసించారు. ఒక‌ప్పుడు 14 ఏళ్ల‌ప్పుడు స‌చిన్ అనూహ్యంగా పైకి వ‌చ్చాడ‌ని, తాను ఏమిటో నిరూపించు కున్నాడ‌ని అన్నారు. ఇదే క్రమంలో వైభ‌వ్ సూర్య వంశీని కూడా తీసుకుంటే అద్భుతాలు చేస్తాడంటూ పేర్కొన్నాడు శ‌శి థ‌రూర్.

Exit mobile version