కోల్ కతా : బీసీసీఐ మాజీ చీఫ్ సౌరవ్ గంగూలీ షాకింగ్ కామెంట్స్ చేశాడు. ఈనెల 288 నుంచి మెగా ఐపీఎల్ టోర్నీ ప్రారంభం కానుంది. ఈసందర్బంగా ఐపీఎల్ రూల్స్ పై స్పందించాడు దాదా. ప్రధానంగా ఐపీఎల్ ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన గురించి అడిగినప్పుడు భారత క్రికెట్ జట్టు దిగ్గజ మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ స్పందించాడు. ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన కొనసాగుతుందని స్పష్టం చేశాడు. నేను బీసీసీఐ అధ్యక్షుడిగా అయినప్పుడు, ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన అప్పటికే అమల్లోకి వచ్చిందన్నారు. కాబట్టి ఇది శాశ్వతంగా ఉంటుందని చెప్పాడు. కొందరికి ఇది నచ్చవచ్చు, కొందరికి నచ్చక పోవచ్చు, కానీ చివరికి ఉత్తమ ఆటగాళ్లే విజయం సాధిస్తారని అన్నాడు.
భారత జట్టు బలంగా ఉందన్నాడు గంగూలీ. తన ఆధిపత్యాన్ని ప్రదర్శించడం ఖాయమన్నాడు. ఇందులో ఎలాంటి సందేహం లేదన్నాడు. ఈ దేశంలో ఉన్న ప్రతిభతో, ఇది రాబోయే సంవత్సరాలలో కూడా కొనసాగుతుందని ఆశాభావం వ్యక్తం చేశాడు. టీ20, వైట్ బాల్ ఫార్మాట్లలో ఇది ఖచ్చితంగా ఉంటుందని తెలిపాడు. ఈ యువ ఆటగాళ్లు టెస్ట్ క్రికెట్‌కు తగినంత విలువను అందిస్తారని, ఆ ఫార్మాట్‌లో కూడా నాణ్యమైన ఆటగాళ్లుగా ఎదుగుతారన్న నమ్మకం తనకు ఉందన్నాడు సౌరవ్ గంగూలీ.
తాజాగా సౌరవ్ గంగూలీ చేసిన కామెంట్స్ క్రికెట్ వర్గాలలో ప్రత్యేకించి ఐపీఎల్ లో కలకలం రేపాయి. అయితే గత కొంత కాలంగా ఈ మెగా టోర్నమెంట్ లో ఇంపాక్ట్ ప్లేయర్ గురించి ఎక్కువగా చర్చకు వస్తోంది. ఈ తరుణంలో తను కీలక కామెంట్స్ చేయడం ప్రస్తుతం ప్రాధాన్యత సంతరించుకుంది.
