చెన్నై : ఆస్కార్ అవార్డు విన్నర్, జగమెరిగిన సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన చేసిన కామెంట్స్ కలకలం రేపుతున్నాయి. ప్రధానంగా కేంద్రంలో కొలువు తీరిన బీజేపీ సర్కార్ ను ఇరుకున పెట్టేలా ఉన్నాయి. కేంద్ర మంత్రులు, ఆ పార్టీకి చెందిన నాయకులు, వివిధ హిందూ సామాజిక వర్గాలు భగ్గుమంటున్నాయి. తక్షణమే రెహమాన్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. ఇంతకూ రెహమాన్ చేసిన వ్యాఖ్యలు ఏమిటంటే గతంలో తనకు పెద్ద ఎత్తున సినిమాలకు సంగీతం అందించేందుకు అవకాశాలు వచ్చేవని అన్నారు. కానీ ఎప్పుడైతే మోదీ సర్కార్ కొలువు తీరిందో దేశంలో పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. తాజాగా ఆయన ఓ ప్రముఖ ఛానల్ తో చిట్ చాట్ సందర్బంగా తన అభిప్రాయాలను పంచుకున్నారు.
ఈ సందర్బంగా తాను ముస్లిం కావడం వల్లనే తనకు పెద్దగా అవకాశాలు రావడం లేదంటూ వాపోయాడు.
1960లు, 70లలో హిందీ సినిమా సంగీతానికి ఉర్దూనే మాతృ భాష అని పేర్కొన్నాడు. ఇదిలా ఉండగా దేశంలో అధికార మార్పు జరిగిన గత ఎనిమిదేళ్లుగా మత పరమైన కారణాల వల్ల తనకు పని దొరకడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశాడు ఏఆర్ రెహమాన్. ఛావా అనేది డబ్బు కోసం తీసిన విద్వేషపూరిత చిత్రం అని సంచలన ఆరోపణలు చేశాడు. అయితే రామాయణానికి సంగీతం సమకూరుస్తున్న ఒక ముస్లింని అంటూ స్పష్టం చేశాడు. తాను ముస్లిం అనే గుర్తింపు కారణంగానే పని దొరకడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు.
