Kamal Haasan : చెన్నై : ప్రముఖ నటుడు, మక్కల్ నీది మయ్యం పార్టీ చీఫ్, రాజ్యసభ సభ్యుడు కమల్ హాసన్ కరూర్ ప్రాంతాన్ని సందర్శంచనున్నారు. ఇటీవలే తమిళ వెట్రీ కజగం (టీవీకే) పార్టీ చీఫ్, స్టార్ హీరో దళపతి విజయ్ గత నెల సెప్టెంబర్ 27న ర్యాలీ చేపట్టారు. ఈ ప్రచార ర్యాలీలో ఊపిరి ఆడక, తొక్కిసలాట చోటు చేసుకుని ఏకంగా 41 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇందులో చిన్నారులు, మహిళలు ఉన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించంది. ఒక్కో కుటుంబానికి రూ. 10 లక్షల పరిహారం, గాయపడిన వారికి వైద్య సాయం చేస్తామని తెలిపారు సీఎం ఎంకే స్టాలిన్. ఉదయనిధి స్టాలిన్ కూడా సందర్శించి బాధిత కుటుంబాలకు భరోసా కల్పించే ప్రయత్నం చేశారు.
Kamal Haasan Meet
మరో వైపు సంఘటన జరిగిన తర్వాత హుటా హుటిన మీడియాతో మాట్లాడకుండానే వెళ్లి పోయారు తిరుచ్చికి టీవీకే చీఫ్ దళపతి విజయ్. దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. తనపై ఎందుకు కేసు నమోదు చేయలేదంటూ ప్రశ్నించింది హైకోర్టు ధర్మాసనం. ఈ మొత్తం ఘటనపై సిట్ తో దర్యాప్తు జరిపించాలని డీఎంకే సర్కార్ ను ఆదేశించింది. మరో వైపు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ సైతం బాధిత కుటుంబాలను పరామర్శించారు. ఒక్కో కుటుంబానికి రూ. 2 లక్షలు, గాయపడిన వారికి రూ. 50 వేలు ప్రకటించారు. దీంతో ఇవాళ కీలక ప్రకటన వచ్చింది ఎంపీ ఇలయ నాయగన్ కమల్ హాసన్ (Kamal Haasan) నుంచి. తాను కూడా కరూర్ కు వెళతానని, బాధితులను పరామర్శిస్తానని పేర్కొన్నారు.
Also Read : CJI Strong Response : షూ విసరడం పట్ల స్పందించిన సీజేఐ
