అమరావతి : ఏపీపీసీసీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా రెడ్డి నిప్పులు చెరిగారు. జాతీయ ఉపాధి హామీ పథక పరిరక్షణ యాత్రలో భాగంగా నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గంలో పర్యటించారు. ఈ సందర్బంగా సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్రంలోని మోదీ సర్కార్ కావాలని తమ పార్టీకి చెందిన ప్రతిపక్ష నాయకుడు , ఎంపీ రాహుల్ గాంధీపై కక్ష కట్టిందంటూ ఆరోపించారు. తనను ప్రశ్నించకుండా ఉండేందుకు ప్రయత్నం చేస్తోందంటూ ధ్వజమెత్తారు. రాహుల్ గాంధీని బీజేపీ భరించ లేక పోతోందన్నారు షర్మిలా రెడ్డి. తన సభ్యత్వాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేయడం సిగ్గుచేటు అని అన్నారు.
ప్రశ్నించే గొంతుకను చంపాలని చూసే కుట్ర తప్ప మరోటి కాదన్నారు. దేశ ప్రతిపక్ష నేతపై సబ్ స్టాంటివ్ మోషన్ పెట్టడం మోదీజి నిరంకుశత్వానికి పరాకాష్ట అని మండిపడ్డారు షర్మిలా రెడ్డి. అమెరికా
ట్రాప్ డీల్ పై రాహుల్ గాంధీ పార్లమెంట్ సాక్షిగా వాస్తవాలు వెల్లడించాడని దానిని జీర్ణించుకోలేక తన సభ్యత్వాన్ని రద్దు చేయించాలని ప్లాన్ చేస్తోందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీ మాట్లాడుతుంటే ప్రధానమంత్రి నరేంద్ర మోదీని తట్టుకోలేక పోతున్నారంటూ ఫైర్ అయ్యారు. అందుకే సభా హక్కుల పేరుతో రాహుల్ గాంధీ గొంతు నొక్కాలని చూసున్నారంటూ ధ్వజమెత్తారు.
బ్లాక్ డీల్ పై కుండబద్దలు కొడితే రాహుల్ గాంధీని దేశ ద్రోహి అంటారా? వ్యతిరేక శక్తులతో కుమ్మక్కు అంటూ నిందలు వేస్తారా ? నిధులు, ఆత్మకథలు అంటూ కట్టుకథలు అల్లుతారా ? ఇదేనా RSS ఉగ్రవాద రాజకీయం ? బ్లాక్ డీల్ కింద ఏకంగా అమెరికాకు భరతమాతను అమ్మేశారంటూ నిప్పులు చెరిగారు షర్మిలా రెడ్డి.
