మాట విన‌క పోతే మ‌రోసారి టారిఫ్‌లు పెంచుతా

భార‌త దేశ ప్ర‌ధానికి ట్రంప్ స్ట్రాంగ్ వార్నింగ్

helloteluugu-DontaldTrump

అమెరికా : తాను చెప్పిన‌ట్లు మాట విన‌క పోతే చ‌ర్య‌లు త‌ప్ప‌వంటూ భార‌త దేశానికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు అమెరికా దేశ అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్. సోమ‌వారం ఆయ‌న మీడియాతో మాట్లాడారు. త‌న‌ను సంతోష పెట్టాల‌ని లేక పోతే మ‌రోసారి టారిఫ్ లు పెంచుతానంటూ ప్ర‌క‌టించాడు. ర‌ష్యా చ‌మురు విష‌యంలో భార‌త్ స‌హ‌క‌రించాల‌ని లేక పోతే భార‌తీయ వ‌స్తువుల‌పై ఉన్న టారిఫ్ ల‌ను మ‌రింత పెంచుతానంటూ చావు క‌బురు చ‌ల్ల‌గా చెప్పారు. ఇప్ప‌టికే వెనుజులా ప్రెసిడెంట్ మురుదోసు, భార్య‌ను బందీగా ప‌ట్టుకున్న స‌మ‌యంలో ఈ కామెంట్స్ చేయ‌డం క‌ల‌క‌లం రేపుతున్నాయి. ఇప్పటికే 50% టారిఫ్ విధిస్తున్నా ఇంకా పెంచే అవకాశం ఉందని పేర్కొన్నాడు. ఈ సంద‌ర్బంగా ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ గురించి కూడా త‌ను ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశాడు.

ఈ విష‌యం గురించి ప్ర‌ధానికి తెలుసుని, త‌న‌ను సంతోష పెట్ట‌డం భార‌త్ కు అత్యంత ముఖ్య‌మ‌ని స్ప‌ష్టం చేశాడు డొనాల్డ్ ట్రంప్. చమురు వాణిజ్యంపై ట్రంప్ భారతదేశాన్ని హెచ్చరించారు. అంతే కాకుండా త్వ‌ర‌లోనే మ‌రింత పెరిగే అవ‌కాశం ఉంద‌న్నారు. ఈ క్ర‌మంలో రష్యన్ చమురు దిగుమతులపై ట్రంప్ సుంకాల బెదిరింపులను పునరుద్ధరించారు. వాణిజ్య ఉద్రిక్తతలను తీవ్రతరం చేశారు . కాగా ప్రత్యక్ష సంభాషణకు సంబంధించిన తాజా వివరాలు అధికారికంగా వెల్లడి కానప్పటికీ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో ట్రంప్ బహిరంగంగా చేసిన వ్యాఖ్యలు ఇటీవలి సంభాషణ లేదా ఇద్దరు నాయకుల మధ్య కనీసం ఊహించిన అవగాహనను సూచిస్తున్నాయి. ఇదిలా ఉండ‌గా తాజాగా ట్రంప్ ఇండియాను ఉద్దేశించి చేసిన కామెంట్స్ పై ఇంకా స్పందించ లేదు ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర దామోద‌ర దాస్ మోదీ.

Exit mobile version