చేస్తానంటే భీమ్స్ కు మ‌రో ఛాన్స్ ఇస్తా

ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేసిన మెగాస్టార్

hellotelugu-Chiranjeevi

హైద‌రాబాద్ : మెగాస్టార్ చిరంజీవి ఆక‌స్తిక‌ర వ్యాఖ్య‌లు చేశాడు. తెలుగు చ‌ల‌న చిత్ర ప‌రిశ్ర‌మ‌లో అత్యంత జ‌నాద‌ర‌ణ పొందిన ద‌ర్శ‌కుడిగా పేరు పొందాడు అనిల్ రావిపూడి. త‌న సినీ కెరీర్ లో తీసిన ప్ర‌తి మూవీ హిట్ గా నిలిచింది. ఇప్ప‌టి వ‌ర‌కు తొమ్మిది చిత్రాలు తీశాడు. అన్నీ విజ‌యాన్ని చ‌వి చూశాయి. తాజాగా ఈ ఏడాది 2026లో సంక్రాంతి పండుగ సంద‌ర్బంగా ముందుకు వ‌చ్చింది మ‌న శంక‌ర వ‌ర ప్ర‌సాద్ గారు. ఇందులో మెగాస్టార్ చిరంజీవితో పాటు అందాల తార నయ‌న‌తార‌, విక్ట‌రీ వెంక‌టేశ్, వీటీకే గ‌ణేష్ , బుల్లి రాజు ముఖ్య పాత్ర‌లు పోషించారు. అత్యంత త‌క్కువ బ‌డ్జెట్ తో సినిమాను తెర‌కెక్కించారు. ఎవ‌రూ ఊహించ‌ని రీతిలో సినీ రంగాన్ని విస్తు పోయేలా చేస్తూ ఏకంగా రూ. 300 కోట్ల క్ల‌బ్ ను దాటేసింది. అంతే కాకుండా మెగాస్టార్ సినీ కెరీర్ లో అత్య‌ధిక వ‌సూళ్లు సాధించిన చిత్రంగా నిలిచి పోయింది.

ఈ సంద‌ర్బంగా మ‌న శంక‌ర వ‌ర ప్ర‌సాద్ గారు మూవీ స‌క్సెస్ మీట్ హైద‌రాబాద్ లో జ‌రిగింది. ఈ సంద‌ర్భంగా మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ త‌న సినిమాకు సంగీతం అందించిన తెలంగాణ ప్రాంతానికి చెందిన మ్యూజిక్ డైరెక్ట‌ర్ భీమ్స్ సిసిరిలియోను ఆకాశానికి ఎత్తేశాడు. నువ్వు అందించిన సంగీతం త‌న సినిమాకు బిగ్ అస్సెట్ గా నిలిచింద‌న్నాడు. అంతే కాకుండా ఇంకోసారి త‌న సినిమా కోసం ప‌ని చేసేందుకు అవ‌కాశం ఇస్తాన‌ని బ‌హిరంగంగానే ప్ర‌క‌టించాడు మెగాస్టార్. దీంతో త‌ను చేసిన కామెంట్స్ ఇప్పుడు వైర‌ల్ గా మారాయి. సోష‌ల్ మీడియాను షేక్ చేస్తున్నాయి.

Exit mobile version