ICICI Bank : పండుగ సీజన్‌ను పురస్కరించుకుని ఐసీఐసీఐ బ్యాంక్ తమ వార్షిక ఫెస్టివ్ బొనాంజా ఆఫర్లను ప్రకటించింది. ఈ ఆఫర్ల ద్వారా వినియోగదారులు రూ.50,000 వరకు తగ్గింపులు, క్యాష్‌బ్యాక్ పొందే అవకాశం ఉంది. మొబైల్స్, ఎలక్ట్రానిక్స్, ఫ్యాషన్, ట్రావెల్, కిరాణా, ఫర్నిచర్, డైనింగ్ వంటి విభాగాల్లో ఈ ఆఫర్లు అందుబాటులో ఉంటాయని బ్యాంక్ తెలిపింది.
క్రెడిట్, డెబిట్ కార్డులు, ఇంటర్నెట్ బ్యాంకింగ్, కార్డ్‌లెస్ ఈఎంఐ, కన్స్యూమర్ ఫైనాన్స్ ద్వారా కస్టమర్లు ఈ ప్రయోజనాలను పొందవచ్చు. అదనంగా నో-కాస్ట్ ఈఎంఐ సౌకర్యం కూడా అందుబాటులో ఉంది.
ICICI Bank – ప్రముఖ బ్రాండ్లతో భాగస్వామ్యం
ఈ ఆఫర్ల కోసం ఐసీఐసీఐ బ్యాంక్ (ICICI Bank) ఆపిల్, ఫ్లిప్‌కార్ట్, క్రోమా, రిలయన్స్ డిజిటల్, వన్‌ప్లస్, మేక్‌మైట్రిప్, గోయిబిబో, యాత్ర, బ్లింకిట్, స్విగ్గీ, అజియో, పెప్పర్‌ఫ్రై వంటి ప్రముఖ బ్రాండ్లతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. సెప్టెంబర్ 23 నుంచి ప్రారంభమయ్యే ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సందర్భంగా ఐసీఐసీఐ (ICICI Bank) కస్టమర్లు అదనంగా 10% తగ్గింపు పొందవచ్చు.
ముఖ్యమైన ఆఫర్లు
- మొబైల్స్, ఎలక్ట్రానిక్స్: ఐఫోన్ 17పై రూ.6,000 వరకు క్యాష్‌బ్యాక్, వన్‌ప్లస్‌పై రూ.5,000 వరకు తగ్గింపు, నథింగ్ స్మార్ట్‌ఫోన్‌లపై రూ.15,000 వరకు ఆఫర్. ఎల్‌జీ, హైయర్, పానసోనిక్ వంటి ఎలక్ట్రానిక్స్‌పై రూ.50,000 వరకు తగ్గింపు.
- ఫ్యాషన్, ట్రావెల్: టాటా క్లిక్‌లో 15% డిస్కౌంట్, అజియోలో 10% తగ్గింపు. మేక్‌మైట్రిప్, గోయిబిబో, యాత్ర, పేటీఎం ఫ్లైట్స్‌లలో ప్రయాణ బుకింగ్స్‌పై రూ.10,000 వరకు ఆఫర్లు.
- కిరాణా, ఫర్నిచర్, డైనింగ్: బిగ్‌బాస్కెట్, బ్లింకిట్, స్విగ్గీ ఇన్‌స్టామార్ట్‌లపై డిస్కౌంట్లు. పెప్పర్‌ఫ్రై, లివ్‌స్పేస్, ది స్లీప్ కంపెనీపై 35% వరకు తగ్గింపు. స్విగ్గీ, ఈజీడైనర్, బిర్యానీ బై ది కిలో వంటి ప్లాట్‌ఫారమ్‌లపై ప్రత్యేక ఆఫర్లు.
రుణాలపై ప్రత్యేక పండుగ ఆఫర్లు
- గృహ రుణం: జీతం పొందే కస్టమర్లకు కేవలం రూ.5,000 ప్రాసెసింగ్ ఫీజు. ఆఫర్ డిసెంబర్ 15 వరకు.
- ఆటో రుణం: తక్షణ ఆటో రుణాలపై ప్రాసెసింగ్ ఫీజు రూ.999 మాత్రమే. ఆఫర్ అక్టోబర్ 31 వరకు.
- పర్సనల్ రుణం: వడ్డీ రేట్లు 9.99% నుంచి ప్రారంభం. ఆఫర్ సెప్టెంబర్ 30 వరకు.
- సెక్యూరిటీలపై రుణం: రూ.20 లక్షల వరకు రుణాలపై కేవలం రూ.1,000 ప్రాసెసింగ్ ఫీజు. ఆఫర్ డిసెంబర్ 31 వరకు.
బ్యాంక్ వ్యాఖ్య
ఈ ఆఫర్లపై ఐసీఐసీఐ బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రాకేష్ ఝా మాట్లాడుతూ –
“కస్టమర్ల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఈ పండుగ ఆఫర్లను రూపొందించాం. సమీపంలోని బ్రాంచ్ లేదా ఆన్‌లైన్ ద్వారా కస్టమర్లు ఈ ప్రయోజనాలను పొందవచ్చు. అన్ని ఆఫర్లకు నిబంధనలు వర్తిస్తాయి,” అని తెలిపారు.
Also Read : GST 2025 Reforms Growth : జీఎస్‌టీ 2.0 సంస్కరణలు రేపటి నుంచి అమల్లోకి



















