IAS Lakshmisha : విజయవాడ : ఏపీకి రెడ్ అలర్ట్ ప్రకటించింది రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ. ఇందులో భాగంగా భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించారు ఐఎండీ ఎండీ ప్రఖర్ జైన్. ఇదిలా ఉండగా వర్షాలపై ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ (IAS Lakshmisha) ఆదివారం ఉదయం టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. వర్షాలు, వరదలపై క్షేత్రస్థాయి అధికారులు అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేశారు. ముందు జాగ్రత్తగా జిల్లా కలెక్టరేట్ లో కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామన్నారు. ఇందుకు సంబంధించి 9154970454 నెంబర్ కు ఫోన్ చేయాలని సూచించారు జిల్లా కలెక్టర్. ఇది 24X7 అందుబాటులో ఉంటుందన్నారు. అన్ని శాఖలు సమన్వయం చేసుకోవాలని స్పష్టం చేశారు డాక్టర్ లక్ష్మీశ.
IAS Lakshmisha Key Update Rains
డివిజన్ స్థాయి లోనూ కంట్రోల్ రూమ్‌లను క్రియాశీలం చేయాలని సూచించారు. కృష్ణా, బుడమేరు, మున్నేరులో ప్రవాహాలను నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు. నదీ పరీవాహక, లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలన్నారు. విజయవాడ అర్బన్ పరిధిలో కొండ ప్రాంతాల ప్రజలను కూడా అప్రమత్తం చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. క్షేత్రస్థాయిలో ఇరిగేషన్, రెవెన్యూ, పోలీస్ తదితర శాఖల అధికారులతో ప్రత్యేక బృందాల ఏర్పాటు చేయాలన్నారు. నదితో పాటు వాగులు, వంకలవైపు ప్రజలు వెళ్లకుండా హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. దీపావళి సందర్భంగా అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
Also Read : KTR Important Meet to Mogulayya : పద్మశ్రీ మొగులయ్యకు కేటీఆర్ భరోసా



















