ప్ర‌జా స‌మ‌స్య‌ల ప‌రిష్కారం కోసం కృషి చేస్తా

మంత్రిగా బాధ్య‌త‌లు చేప‌ట్టిన మేరీ విల్స‌న్

heellotelugu-TVKMlaWilson

చెన్నై | తమిళనాడు మంత్రివర్గ విస్తరణ లో కీల‌క మంత్రిత్వ శాఖ ద‌క్కింది టీవీకే ఎమ్మెల్యే మేరీ విల్స‌న్ కు. గురువారం సీఎం జోసెఫ్ విజ‌య్ చంద్ర‌శేఖ‌ర్ సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు. ఇవాళ లోక్ భ‌వ‌న్ లో కొత్త‌గా 23 మంది ఎమ్మెల్యేల‌కు మంత్రులుగా ఛాన్స్ ఇచ్చారు. వీరిలో 21 మంది టీవీకే పార్టీకి చెందిన వారు ఉండ‌గా కాంగ్రెస్ పార్టీకి చెందిన మ‌రో ఇద్ద‌రు ఎమ్మెల్యేల‌కు కేబినెట్ లో చోటు క‌ల్పించారు. మిగ‌తా పార్టీల నుంచి ఇంకా అభ్య‌ర్థుల జాబితా రాలేదు. దీంతో ప్ర‌స్తుతం గ‌వ‌ర్నర్ చేత ప్ర‌మాణం చేసిన వారిలో ఆర్కే న‌గ‌ర్ నియోజ‌క‌వ‌ర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన మేరీ విల్స‌న్ కూడా ఉన్నారు.

ఆయ‌న ఈ సంద‌ర్బంగా స్పందించారు. మీడియాతో మాట్లాడారు. త‌న‌కు ఆర్థిక, ప్రణాళిక , అభివృద్ధి శాఖల బాధ్యతలు అప్పగించడం ఆనంందంగా ఉంద‌న్నారు. నాకు ఈ అవకాశాన్ని కల్పించినందుకు తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజ‌య్ చంద్ర‌శేఖ‌ర్ కు, అలాగే నాకు ఓటు వేసిన RK నగర్ నియోజకవర్గ ప్రజలకు నేను కృతజ్ఞతలు తెలియ జేస్తున్నానని అన్నారు మేరీ విల్స‌న్. ఈ శాఖల బాధ్యతలను స్వీకరించి, ప్రజల కోసం పని చేయడానికి నేను ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తున్నానని అన్నారు.

ఇక రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకార కార్యక్రమంలో మూడవదిగా వినిపించిన తమిళ ప్రార్థనా గీతం గురించి ఆయన కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని గవర్నర్ కార్యాలయం నిర్వహించింద‌ని అన్నారు. ఇందులో మాకు ఎటువంటి పాత్ర లేదని చెప్పారు మేరీ విల్స‌న్. మా ప్రభుత్వ కార్యక్రమాలలో, గతంలో ఏ సంప్రదాయాలు అయితే పాటించ బడ్డాయో, ప్రస్తుతం కూడా అవే పాటించ బడతాయని మీరే గమనిస్తారన్నారు. త‌మ స‌ర్కార్ పూర్తిగా పార‌ద‌ర్శ‌క పాల‌న అందించేందుకు కృషి చేస్తామ‌న్నారు.

Exit mobile version