Kiara Advani : బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ ట్రెండింగ్ లో కొనసాగుతోంది. సోషల్ మీడియాను షేక్ చేస్తోంది ఈ ముద్దుగుమ్మ. వార్ -2 హిందీ మూవీలో కీ రోల్ పోషించింది. తనతో పాటు టాప్ హీరో హృతిక్ రోషన్ తో పాటు తెలుగు చలన చిత్ర పరిశ్రమలో మోస్ట్ పాపులర్ హీరోగా గుర్తింపు పొందిన జూనియర్ ఎన్టీఆర్ తొలిసారిగా ఇందులో నటించాడు. ఒకరిని మించి మరొకరు పోటీ పడి నటించారు. అంతే కాదు హాలీవుడ్ ను తలదన్నేలా చిత్రీకరించాడు దర్శకుడు.
Kiara Advani Sensational
వార్ -2 మూవీ పోస్టర్స్, టీజర్, సాంగ్స్ కు విపరీతమైన రెస్పాన్స్ వస్తోంది. అంతే కాకుండా లవ్లీ బ్యూటీ గర్ల్ కియారా అద్వానీ అందాలను ఆరబోసింది. ప్రత్యేకించి తన బికినీ షూట్ యువతను నిద్ర పోనీయకుండా చేస్తోంది. ఎక్కడ చూసినా సామాజిక మాధ్యమాలలో టాప్ లో కొనసాగుతోంది. హ్యాష్ ట్యాగ్ కియారా అద్వానీ (Kiara Advani) కెవ్వు కేక అనేలా ఉంది. అంతే కాకుండా వీడియోలు సైతం హల్ చల్ చేస్తున్నాయి. వార్ -2 ను ప్రముఖ బాలీవుడ్ నిర్మాణ సంస్థ యశ్ రాజ్ ఫిలింస్ భారీ బడ్జెట్ తో నిర్మించింది. ఈ సినిమా టీజర్ గత మే నెల 20వ తేదీన విడుదలైంది.
భారీ ఎత్తున స్పందన లభించింది. ఇప్పటికీ యూట్యూబ్ ను షేక్ చేస్తోంది. కియారా బికినీ షాట్ రాగానే దానిని విపరీతంగా షేర్ చేయడం ప్రారంభించారు. కాగా ఆమె బికినీ లుక్ చర్చనీయాంశంగా మారింది. విచిత్రం ఏమిటంటే తను త్వరలో తల్లి కాబోతోంది. అయినా ఎక్కడా తగ్గడం లేదు . వార్ -2తో పాటు ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ హీరో యష్ తో కలిసి టాక్సిక్ లో నటిస్తోంది.
Also Read : Deputy CM Bhatti Vikramarka Proven : పూలే విజ్ఞాన్ భవన్ ఏర్పాటుకు కృషి చేస్తాం
