Hydraa : హైదరాబాద్ : హైడ్రా దూకుడు పెంచింది. కబ్జాలను గుర్తించి స్వాధీనం చేసుకునే పనిలో పడింది. తాజాగా నిజాంపేట మున్సిపాలిటీలో వేర్వేరు ప్రాంతాల్లో రెండు పార్కులను హైడ్రా (Hydraa) కాపాడింది. బృందావన్ కాలనీలో 2300 గజాల పార్కును కాపాడగా కౌశల్యా కాలనీలోని 300ల గజాల పరిధిలోని బనియన్ ట్రీ పార్కును కబ్జాల నుంచి రక్షించింది. 2600ల గజాల స్థలం విలువ రూ. 39 కోట్లకు పైగా ఉంటుందని స్థానికులు అంచనా వేస్తున్నారు. హైడ్రా ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదుల మేరకు క్షేత్ర స్థాయిలో విచారించిన అధికారులు పార్కు స్థలాలుగా గుర్తించి ఆక్రమణలను తొలగించింది. దీంతో బృందావన్ కాలనీ నివాసితులు పిల్లా పాపలతో పార్కుకు వచ్చి సంబరాలు చేసుకున్నారు. సర్వే నంబరు 93లో ఉన్న ఈ స్థలాన్ని పార్కు స్థలంగా గతంలోనే నిర్ధారించారు.
Hydraa Huge Save
అయితే సర్వే నంబరు 94 కి సంబంధించిన ల్యాండ్‌గా స్థానికంగా పేర్కొంటూ స్థానికంగా ఉన్నవారు కబ్జా చేశారు. ఇప్పటికే వినియోగంలో ఉన్న పార్కు స్థలంలోని పిల్లల ఆట వస్తువులు ధ్వంసం చేసి.. పార్కు బోర్డును తొలగించి, ప్రహరీని కూడా కూల్చేసి కబ్జా చేశారు. బృందావన్ కాలనీ ప్రతినిధులు హైడ్రాకు ఫిర్యాదు చేశారు. హైడ్రా సంబంధిత స్థానిక అధికారులతో పరిశీలించి పార్కు స్థలంగా నిర్ధారించింది. హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ ఆదేశాల మేరకు ఆక్రమణలను తొలగించి పార్కు స్థలం చుట్టూ ఫెన్సింగ్ వేసింది. పార్కులను కాపాడినట్టు సూచిస్తూ హైడ్రా బోర్డులను ఏర్పాటు చేసింది. దీంతో బృందావన్ కాలనీ నివాసితులు ఊపిరి పీల్చుకున్నారు. హైడ్రాను తెచ్చిన ప్రభుత్వానికి, ఫిర్యాదు చేసిన వెంటనే స్పందించి పార్కులను కాపాడిన హైడ్రాకు అనుకూలంగా నినాదాలు చేశారు. హైడ్రాకు ధన్యవాదాలు తెలిపారు.
Also Read : Donald Trump Shocking Comments : అణ్వాయుధాలను పరీక్షించాలి : డొనాల్డ్ ట్రంప్
