HYDRAA Shocking Decision : ఆక్రమణలను తొలగించిన హైడ్రా

హైడ్రా చర్యలపై స్థానికుల హర్షం

helloteluugu-hydraa

HYDRAA : హైద‌రాబాద్ – హైడ్రా దూకుడు పెంచింది. హైద‌రాబాద్ న‌గ‌రంలో పెద్ద ఎత్తున చోటు చేసుకున్న ఆక్ర‌మ‌ణ‌ల‌పై, భూ క‌బ్జాల‌పై దృష్టి సారించింది. క‌మిష‌న‌ర్ ఏవీ రంగ‌నాథ్ త‌న‌దైన శైలిలో ప‌రిష్క‌రించేందుకు ప్ర‌య‌త్నం చేస్తున్నారు. మంగ‌ళ‌వారం మూసీ నది గర్భంలో ఆక్రమణలను తొలగించింది హైడ్రా. చాదరఘాట్ బ్రిడ్జి నుంచి పాత బస్తీ ఉస్మానియా ఆసుపత్రి మార్చురీ వరకు పలు ప్రాంతాల్లో ఆక్రమణలు తొలగించింది. వాహనాల పార్కింగ్ కోసం వినియోగిస్తున్నారు ఆక్రమణ దారులు.

HYDRAA Shocking Decision

హైడ్రా (HYDRAA) సిబ్బంది రంగంలోకి దిగారు. చదును చేసి షెడ్డు లు నిర్మించి కిరాయికి ఇస్తున్నారు కబ్జాదారులు.మూసీ ఆక్రమణలపై హైడ్రాకు ఫిర్యాదులు నేపథ్యంలో చర్యలకు దిగింది. 3.10 ఎకరాల మేర కబ్జా చేసి షెడ్డు నిర్మించి అక్రమ వ్యాపారం చేస్తున్నారు తికారం సింగ్ అనే వ్య‌క్తి. 1.30 ఎకరాల మేర కబ్జా చేసిన పూనమ్ చాంద్ యాదవ్. 5.22 ఎకరాల మేర కబ్జా చేసిన జయకృష్ణ. కబ్జా చేసిన వారంతా అక్కడ షెడ్డు లు వేసి.. వాటిని అద్దెకు ఇచ్చి వ్యాపారం చేస్తున్నట్టు వెల్లడించారు క‌మిష‌న‌ర్ ఏవీ రంగ‌నాథ్.

బస్సులు, లారీల పార్కింగ్ కోసం కిరాయికి ఇస్తూ వినియోగిస్తున్న‌ట్లు తేలింది హైడ్రా విచార‌ణ‌లో.
అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నట్టు పరిసర ప్రాంతాల ప్రజలు ఫిర్యాదు చేశారు. నర్సరీ బిజినెస్ నిర్వహణ చేప‌ట్టారు. మూసి గర్భంలో మట్టిపోసి షెడ్డు ల నిర్మాణం చేప‌ట్టిన‌ట్లు గుర్తించారు.
ఆక్రమణలను తొలగించింది హైడ్రా.

Also Read : HYDRAA Commissioner Shocking : దేవుడి పేరుతో కబ్జాల పర్వం క‌మిష‌న‌ర్ ఆగ్ర‌హం

Exit mobile version