HYDRAA Commissioner Shocking : దేవుడి పేరుతో కబ్జాల పర్వం క‌మిష‌న‌ర్ ఆగ్ర‌హం

ప్రజావాణి ఫిర్యాదుల్లో అవే అగ్రభాగం

Hello Telugu - HYDRAA Commissioner Shocking

Hello Telugu - HYDRAA Commissioner Shocking

HYDRAA : హైద‌రాబాద్ – రహదారులు, పార్కులు, ప్రజావసరాలకు ఉద్దేశించిన స్థలాలు, ప్రభుత్వ భూములు ఇలా ఏవైనా..,ఎక్కడైనా ఆక్రమణలకు పాల్పడాలన్నా కబ్జాలు చేయాలన్నా దేవుడిని రంగంలోకి దించేస్తున్నారు. ఆలయాలు, ప్రార్థనా మందిరాలంటూ నివాసితులను నోరెత్తకుండా చేస్తున్నారు. మాలాంటి వారు ఎవరైనా ముందుకు వచ్చి ఫిర్యాదు చేస్తుంటే.. కుల, మత సంఘాలను వెనుకేసుకు వచ్చి దాడులకు పాల్పడుతున్నారు. కాలనీలు, బస్తీలే కాదు.. కొత్తగా వచ్చిన గేటెడ్ కమ్యూనిటీలు, హెచ్ ఎండీఏ అనుమతి పొందిన లే ఔట్లలో కూడా ఇదే దందా కొనసాగుతోంది అని పలువురు కాలనీ, బస్తీవాసులు హైడ్రా (HYDRAA) ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు.

HYDRAA Commissioner Slams

హైడ్రా ప్రజావాణిలో మొత్తం 51 ఫిర్యాదులందగా.. అందులో అధిక భాగం రహదారులు, నాలాలు ఆక్రమణలే ఎక్కువ సంఖ్యలో ఉన్నాయి. కూకట్పల్లి నియోజకవర్గం పరిధిలోని ఆంజనేయ నగర్లో దాదాపు ఎకరం పార్కులో జెండా పాతి కొంతమంది కబ్జాకు పాల్పడుతుంటే.. సికింద్రాబాద్ చికోటీ గార్డెన్స్ పరిసరాల్లో గుడికి అనుసంధానంగా షెడ్డులు వేసి రోడ్డును ఆక్రమిస్తున్న వారు మరికొందరు. పటాన్ చెరు ప్రాంతంలో 500ల విల్లాలున్న ఏపీఆర్ ప్రవీణ్ లగ్జీరియాలో కూడా ఎకరం పార్కు స్థలంలో కొంతమేర గుడి కట్టి కబ్జా చేయాలని ప్రయత్నిస్తున్నారని అక్కడి నివాసితులు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదులను హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ పరిశీలించారు.

గూగుల్ మ్యాప్స్ ద్వారా పరిస్థితిని ఫిర్యాదుదారులకు వివరించారు. సమస్య పరిష్కరానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు. కాలనీ సంక్షేమ సంఘాలు, సొసైటీలు ఖాళీ స్థలాలను ప్లాట్లుగా అమ్ముకుంటే వారి పైన చర్యలు తీసుకోవాలని పలువురు అసెట్ ప్రొటెక్షన్ అధికారులను కమిషనర్ ఆదేశించారు.

Also Read : TGEAPCET Counselling Important Update : టీజీఈఏపీసీఈటీ రెండవ దశ కౌన్సెలింగ్

Exit mobile version