Hydraa : హైదరాబాద్ : మాధాపూర్, బోరబండ సరిహద్దుల్లోని సున్నం చెరువు ఎఫ్‌టీఎల్ పరిధిలోకి వస్తున్న ఆంజనేయ గుడితో పాటు ముస్లింల ప్రార్థనా స్థలం చిల్లా తరలింపునకు అంగీకారం కుదిరింది. సున్నం చెరువు పరిసర ప్రాంత ప్రజలతో హైడ్రా (Hydraa) ఏర్పాటు చేసిన సమావేశంలో ఇరు పక్షాలకు చెందిన వారు ఇందుకు సమ్మతి వ్యక్తం చేశారు. హైడ్రా మొదటి విడతలో పునరుద్ధరిస్తున్న ఆరు చెరువుల్లో సున్నం చెరువు కూడా ఉందనే విషయం అందరికీ విధితమే. అయితే ఈ చెరువు ఎఫ్‌టీఎల్ పరిధిలో చిన్న ఆంజనేయ గుడితో పాటు ఆ సమీపంలోనే ముస్లింల చిల్లా కూడా ఉంది. ఇవి ఎఫ్‌టీఎల్ పరిధిలోకి వస్తున్నందున వీటిని చెరువు గట్టు వైపు తరలించాలని హైడ్రా భావించింది.
Hydraa Meeting With Sunnam Cheruvu People
వీటి తరలింపునకు సంబంధించిన అంశం సామాజిక మాధ్యమాల్లో చర్చ నీయాంశం అయ్యింది. ఈ నేపథ్యంలో ఇరు పక్షాలకు చెందిన స్థానికులతో హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ హైడ్రా కార్యాలయంలో చర్చించారు. సుప్రింకోర్టు మార్గదర్శకాలను వివరించారు. ఆంజనేయ విగ్రహంతో పాటు, చిల్లాను చెరువు ఎఫ్‌టీఎల్ పరిధిలో కాకుండా.. చెరువు గట్టు వైపు తరలించే విషయమై వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు. ఇరు పక్షాలకు చెందిన స్థానికులు అంగీకారం చెప్పడంతో ఈ సమస్యకు పరిష్కారం దొరికింది. సున్నం చెరువు చెంత.. వాటిని సురక్షితంగా తరలించడానికి స్థానికులు అంగీకారం వ్యక్తం చేశారు. దీంతో ఈ సమస్యకు తెరపడింది. ఈ సందర్బంగా ఇరు పక్షాలకు చెందిన వారు హైడ్రా కమిషనర్ తీసుకున్న చొరవకు ధన్యవాదాలు తెలిపారు.
Also Read : CM Chandrababu Interesting Comments : శ్రీ సత్యసాయి విద్యా విధానానికి విద్యార్థులే ప్రతిరూపాలు
