CM Chandrababu Interesting Comments : శ్రీ స‌త్య‌సాయి విద్యా విధానానికి విద్యార్థులే ప్ర‌తిరూపాలు

కీల‌క వ్యాఖ్య‌లు చేసిన సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు

Hello Telugu - CM Chandrababu Interesting Comments

Hello Telugu - CM Chandrababu Interesting Comments

CM Chandrababu : శ్రీ స‌త్య‌సాయి పుట్ట‌ప‌ర్తి జిల్లా : భగవాన్ శ్రీ సత్యసాయి బాబా విశిష్టమైన విద్యా విధానానికి విద్యార్థులే ప్రతిరూపాలు అని అన్నారు ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు (CM Chandrababu). పుట్ట‌ప‌ర్తిలో జ‌రిగిన స్నాతకోత్సవంలో పాల్గొన్నారు ఉప రాష్ట్ర‌ప‌తి రాధాకృష్ణ‌న్ తో క‌లిసి. ఈ సంద‌ర్బంగా సీఎం మాట్లాడారు. శ్రీ సత్యసాయి ఇనిస్టిట్యూట్ ఆఫ్ హయ్యర్ లెర్నింగ్ 44వ స్నాతకోత్సవానికి హాజరైనందుకు ఎంతో గౌరవంగా భావిస్తున్నానని చెప్పారు. పట్టభద్రులైన గ్రాడ్యుయేట్లందరికీ అభినందనలు తెలిపారు. భ‌గ‌వాన్ శ్రీ సత్యసాయి బాబా ఒక ఉద్దేశ్యంతో ఈ లోకానికి వచ్చారని అన్నారు. ఒక ఉద్దేశ్యం కోసమే జీవించారు. మన కోసం ‘సాయి సిద్ధాంతాన్ని’ ఇచ్చి వెళ్లారని అన్నారు.శ్రీ సత్యసాయి బాబా విద్యా విధానం ప్రకారం ఫస్ట్, సెకండ్, థర్డ్ లాంగ్వేజీలన్నీ సేవే. ఇప్పుడు పట్టభధ్రులు అయిన వారంతా నిస్వార్థ సేవ, కరుణ నిజాయితీ అనే విలువలను గట్టిగా ఆచరించాల‌ని పిలుపునిచ్చారు నారా చంద్ర‌బాబు నాయుడు.

CM Chandrababu Praises Sathya Saibaba Services

భారతదేశం వేల సంవత్సరాలుగా తన ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ప్రపంచంతో పంచుకుంటోంద‌ని చెప్పారు సీఎం. వసుధైక కుటుబం అంటే ప్రపంచమంతా ఒకే కుటుంబం అనేది శాశ్వత సందేశం. ఇది మన సంస్కృతికి గుండెకాయ వంటిద‌ని అన్నారు. శ్రీ సత్యసాయి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హయ్యర్ లెర్నింగ్ సంస్థ విద్యాభ్యాసంతో పాటు నీతి, విలువలను కూడా మిళితం చేస్తుందన్నారు. Science, Technology, Arts వంటి రంగాల్లో నైపుణ్యంతో పాటు, సామాజికంగా ఉపయోగపడే పరిశోధనలపై ఇక్కడ బలమైన ప్రాధాన్యత ఉంద‌న్నారు. శ్రీ సత్యసాయి ఇనిస్టిట్యూట్ ఆఫ్ హయ్యర్ లెర్నింగ్ సంస్థ యువ మేధావులను తీర్చిద్దింద‌ని కొనియాడారు.. 21వ శతాబ్దం భారతదేశానిదని అన్నారు.

Also Read : CP Radhakrishnan Important Comments : సత్య సాయి ట్రస్టు సేవ‌లు అద్బుతం : ఉప రాష్ట్రపతి

Exit mobile version