Hydraa Shocking : క‌బ్జాల‌పై హైడ్రా ఉక్కుపాదం జ‌నం సంతోషం

భారీ ర్యాలీలు, ప్ల‌కార్డుల‌తో ప్ర‌ద‌ర్శ‌న‌లు

Hello Telugu - Hydraa Shocking

Hello Telugu - Hydraa Shocking

Hydraa : హైద‌రాబాద్ : ఆక్ర‌మ‌ణ‌దారులు, క‌బ్జారాయుళ్ల‌పై హైడ్రా ఫోక‌స్ పెట్టింది. పెద్ద ఎత్తున ప్ర‌భుత్వ స్థ‌లాల‌ను కాపాడింది. రోజు రోజుకు హైడ్రాకు ప్ర‌జ‌ల నుంచి మ‌ద్ద‌తు ల‌భిస్తోంది. కాగా హైడ్రాపై (Hydraa) కొంత‌మంది కావాల‌ని చేస్తున్న దుష్ప్ర‌చారాన్ని కాల‌నీ, బ‌స్తీవాసులు తిప్పి కొడుతున్నారు. పేద‌, మ‌ధ్య‌త‌ర‌గ‌తి, సామాన్య ప్ర‌జానీకం గొంతుగా మారిన హైడ్రాకు న‌గ‌ర ప్ర‌జలు నీరాజ‌నాలు ప‌లుకుతున్నారు. హైడ్రా వ‌ల్ల జ‌రిగిన మేలును వివ‌రిస్తూ ర్యాలీలు నిర్వ‌హిస్తున్నారు. ప్ల‌కార్డులు చేత‌ప ట్టుకుని హైడ్రా జిందాబాద్ అంటూ నిన‌దిస్తున్నారు. అంబ‌ర్‌పేట‌లోని బ‌తుక‌మ్మ కుంట చెంత వాకింగ్ చేసిన వారు హైడ్రా ప‌నుల‌ను కీర్తిస్తే, మ‌ణికొండ మ‌ర్రి చెట్టువ‌ద్ద దాదాపు 15 కాల‌నీల వారు ర్యాలీ నిర్వ‌హించారు. మ‌ణికొండ మున్సిపాలిటీలో రూ. వెయ్యి కోట్ల‌కు పైగా విలువైన పార్కుల‌ను కాపాడి న‌గ‌ర ప్ర‌జ‌ల‌కు ప్రాణ‌వాయువును అందించారంటూ ప్ల‌కార్డులు ప్ర‌ద‌ర్శించారు.

Hydraa Shocking

నెక్నాంపూర్ విలేజ్‌, తిరుమ‌ల హిల్స్ నుంచి చిన్నా పెద్ద వ‌చ్చి ర్యాలీలో పాల్గొన్నారు. ఖాజాగూడ ప్ర‌శాంతి హిల్స్‌లో హైడ్రా కాపాడిన పార్కుల్లో మొక్క‌లు నాటారు. కొండాపూర్‌లోని రాఘ‌వేంద్ర కాల‌నీలో ఉస్మానియా యూనివ‌ర్సిటీ ప్రొఫెస‌ర్స్ కాల‌నీలో 4300 గ‌జాల ప్ర‌జావ‌స‌రాల‌కు ఉద్దేశించిన స్థ‌లాల‌ను కాపాడారంటూ ర్యాలీ నిర్వ‌హించారు. అలాగే రాఘ‌వేంద్ర కాల‌నీలో 2000 గ‌జాల పార్కును కాపాడినందుకు అభినంద‌న స‌భ ఏర్పాటు చేశారు. ఒక‌రిద్ద‌రి స్వార్థ ప్ర‌యోజ‌నాల కోసం వంద‌ల‌మంది న‌ష్ట‌పోవాలా…? హైడ్రాతో ల‌క్ష‌లాది మందికి న్యాయం జ‌రిగిందంటూ అభినందించారు. కొంత‌మంది ధ‌న‌దాహంతో క‌బ్జాలు చేసి రూ. కోట్లు గ‌డించాల‌ని చూసేవారి ఆట‌లు ఇక చెల్ల‌వు అని హైడ్రా నిరూపించింది.

Also Read : AP Gets Huge Investments : టెక్స్ టైల్స్ రంగంలో భారీగా పెట్టుబడులు

Exit mobile version