Hydraa : హైదరాబాద్ : హైడ్రా దూకుడు పెంచింది. కబ్జాదారుల పాలిట సింహ స్వప్నంగా మారింది. వర్షం ఎంత పడినా హైడ్రా (Hydraa) ఉందనే భరోసా నగర ప్రజలకు ఇచ్చారు. భారీ వర్షాలు పడినా వరదలు ముంచెత్తకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. నిత్యం క్యాచ్‌పిట్లు, కల్వర్టులతో పాటు.. నాలాల్లో పూడిక తీసి వరద సాఫీగా సాగేలా చర్యలు తీసుకున్నారు అని మాన్సూన్ ఎమర్జన్సీ, డిజాస్టర్ రెస్పాన్స్ బృందాలను హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ అభినందించారు. వర్షాకాలంలో పని చేసే మాన్సూన్ ఎమర్జన్సీ టీమ్‌ల కాలపరిమితి 150 రోజులు పూర్తయిన సందర్భంగా జలవిహార్ లో ఏర్పాటు చేసిన అభినందన సభలో పాల్గొని మాట్లాడారు. 5 నెలల క్రితం ఇక్కడే సమావేశమై మాన్సూన్ విధుల గురించి వివరించామని గుర్తు చేశారు. నిర్దేశించిన దానికంటే ఎక్కువ పని చేసి హైడ్రాతో పాటు ప్రభుత్వానికి మంచి పేరు తీసుకు వచ్చారని ప్రశంసలు కురిపించారు.
Hydraa Commission Appreciates
వర్షాల వేళ ముప్పు ప్రాంతాల్లో సేవలందిస్తూ ప్రజల ప్రశంసలు అందుకున్నారని, పనితీరును కొనియాడారు కమిషనర్. సమస్య పరిష్కారం వరకే పరిమితం అవ్వకుండా ఆ సమస్యకు కారణాలను కూడా తెలుసుకుని పని చేసిన తీరు అభినందనీయమని పేర్కొన్నారు. హైడ్రాలో భాగమైన డిజాస్టర్ రెస్పాన్స్ సిబ్బంది, ఎస్ ఎఫ్ వోలు, మార్షల్స్‌తో కలసి మెట్ టీమ్‌లు ఎంతో నిబద్ధతతో పని చేశాయని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ అభినందించారు. ఇలా 3 వేల లారీల పూడికను నాలాల నుంచి తొలగించి వరద సాఫీగా సాగేలా రేయింబవళ్లు పని చేసిన తీరు నగర ప్రజలు గమనించారన్నారు. వర్షాలు వస్తున్న వేళ.. వరద భయం లేకుండా నగర ప్రజలు ప్రయాణాలు సాఫీగా సాగించారని తెలిపారు. కాలనీలు నీట మునగకుండా ముందస్తు జాగ్రత్తలో వరద ముప్పు లేకుండా చేశారంటూ హైడ్రా కమిషనర్ మెట్ టీమ్‌లను కొనియాడారు.
Also Read : Sri Sri Sri Nanjavadootha Swami Strong Demand : వొక్కలిగ వర్గానికి సీఎంగా ఛాన్స్ ఇవ్వాలి
