హైదరాబాద్ : హైదరాబాద్ లో జరిగిన రగ్బీ ప్రీమియర్ లీగ్ సీజన్ -2 ఫైనల్ లో ముంబై డ్రీమ్స్ పై హైదరాబాద్ గ్రాండ్ విక్టరీ నమోదు చేసింది. విజేతగా నిలిచింది. గచ్చిబౌలి స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ అత్యంత ఉత్కంఠ భరితంగా సాగింది చివరి దాకా. గెలుపొందిన అనంతరం కెప్టెన్ కీలక వ్యాఖ్యలు చేశాడు. టోర్నమెంట్ అంతటా మా కుర్రాళ్ల ప్రదర్శన పట్ల నాకు ఎంతో గర్వంగా ఉంది. మేము అత్యుత్తమ జట్లలో ఒకటిగా నిలిచాము, అయితే తమ సామర్థ్యాన్ని నిరూపించు కోవాలని నేను వారికి ఎప్పుడూ గుర్తు చేస్తూనే ఉన్నాను. కఠిన శ్రమకు తగిన ప్రతిఫలం (విజయం) దక్కడం చాలా సంతోషాన్నిచ్చింది. కేవలం మూడు వారాల పాటు మాత్రమే కలిసి ఉన్న జట్టు నుండి ఫైనల్లో ఇలాంటి అద్భుతమైన ఆటతీరును చూడటం గొప్ప విషయం..
అంతకంటే ఎక్కువ ఆశించలేను, అందరికీ ధన్యవాదాలు అని హైదరాబాద్ హీరోస్ కెప్టెన్ మను మోరెనో అన్నారు. మా కుర్రాళ్ల గురించి నాకు చాలా గర్వంగా ఉంది. టోర్నమెంట్ అంతటా మేము అత్యుత్తమ జట్లలో ఒకటిగా రాణించాం. కేవలం మూడు వారాల పరిచయం ఉన్న జట్టు నుండి ఫైనల్లో ఇలాంటి నాణ్యమైన ఆట రావడం అద్భుతం,” అని హైదరాబాద్ హీరోస్ హెడ్ కోచ్ డీజే ఫోర్బ్స్ అన్నారు. ఈ విజయం సాధించినందుకు చాలా సంతోషంగా ఉంది, దీని కోసం మేము చాలా కష్టపడ్డాము. మైదానం బయట జట్టు సభ్యుల మధ్య ఏర్పడిన అనుబంధాన్ని, మైదానంలో కూడా ప్రదర్శించడమే మా లక్ష్యంగా పెట్టుకున్నాము. జట్టు పట్ల గర్వంగా ఉందన్నాడు.



















