హైదరాబాద్ : జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్. కృష్ణయ్య కీలక వ్యాఖ్యలు చేశారు. సుప్రీంకోర్టు తాజాగా సంచలన తీర్పు చెప్పింది మాదాపూర్ భూములకు సంబంధించి . అవి ప్రైవేట్ పరం కాకూడదని, పక్కాగా ప్రభుత్వ భూములేనని వెల్లడించింది. దీనిపై స్పందించారు ఆర్. కృష్ణయ్య. మియాపూర్ లోని 500 ఎకరాల ప్రభుత్వ భూములను ఇల్లు లేని పేదలకు ఇల్లు కట్టివ్వాలని కోరారు. అలాగే హాస్టళ్లు, గురుకులాలకు సొంత భవనాలు కట్టాలని ముఖ్యమంత్రికి లేఖ రాసినట్లు చెప్పారు ఆర్. కృష్ణయ్య. 500 ఎకరాల ప్రభుత్వ భూమిని వేలం వేస్తామని ముఖ్యమంత్రి ప్రకటించడం తగదన్నారు. ఇది ప్రజలకు ఉపయోగపడే విధంగా ఉపయోగించాలని డిమాండ్ చేశారు. మియాపూర్ భూమి ప్రభుత్వ భూమిగా సుప్రీంకోర్టులో వాదించి గెలవడం హర్షించదగ్గ విషయం అని పేర్కొన్నారు. భూమిని వేలం వేయడం కంటే రెండు విధాలుగా ఉపయోగించాలని రాజ్యసభ సభ్యులు సీఎంకు సూచించారు.
ఇందులో 200 ఎకరాల భూమిని నిరుపేదలకు, ఇల్లు లేని పేదలకు ఇల్లు కట్టి కట్టించడానికి ఉపయోగించాలని కోరారు. నగరంలో 6 లక్షల కుటుంబాలకు ఒక గజం భూమి లేదని ఆవేదన వ్యక్తం చేశారు ఆర్.కృష్ణయ్య. అద్దె ఇళ్ళలో పుట్టెడు కష్టాలతో జీవిస్తున్నారని వాపోయారు. మిగతా 300 ఎకరాల భూమిని బీసీ, ఎస్సీ, ఎస్టీల ప్రభుత్వం కాలేజీ హాస్టళ్లకు 100 ఎకరాల భూమి కేటాయించాలని పేర్కొన్నారు. 200 ఎకరాలు గురుకులాల భవనాలకి సొంత భవనాలు నిర్మించాలని కోరారు ఆర్. కృష్ణయ్య. గ్రేటర్ హైదరాబాద్ లో 100 బీసీ కాలేజీ హాస్టళ్లు ఉండగా ఒక్కదానికి కూడా సొంత భవనాలు లేవని, వీటికి స్వంత భవనాలు నిర్మించాలని అన్నారు. అలాగే మిగతా 200 ఎకరాల భూమిని 70 బీసీ గురుకులాలు అద్దె భవనాలలో నడుస్తున్నాయని, వీటికి ఒక్క దానికి కూడా సొంత భవనాలు లేవు అన్నారు. వీటికి అద్దె కింద ఏటా వందల కోట్ల రూపాయలు చెల్లిస్తున్నారని తెలిపారు.
ఈ భూమిని హాస్టళ్లు, గురుకులాలకు కేటాయిస్తే నిర్మించడానికి కేంద్ర ప్రభుత్వ నిధులు, సిఎస్ఆర్ నిధులు అలాగే కార్పొరేట్ సంస్థల నుంచి వందల కోట్ల రూపాయలు సేకరించి స్వంత పక్కా భవనాలు నిర్మించాలని డిమాండ్ చేశారు. ఇది చారిత్రాత్మకంగా ఉంటుందన్నారు. స్వంత భవనాలు నిర్మిస్తే సౌకర్యవంతంగా యుండి విద్యార్థులు బాగా చదివి విద్యా ప్రమాణాలు పెరుగుతాయని అన్నారు. ఇలా నిర్మిస్తే అద్దె భవనాలకు అద్దె కింద వేల కోట్ల రూపాయలు ప్రభుత్వానికి చెల్లించే భాద తప్పుతుందన్నారు.

















