అమరావతి : ఏపీ కూటమి ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. టెక్నాలజీ పరంగా క్వాంటం ఎంత ముఖ్యమో, హార్టికల్చర్ కూడా అంతే ముఖ్యం. ఆక్వాకల్చర్ కూడా అంతే ముఖ్యం అని స్పష్టం చేసింది. అక్టోబర్ 2న హార్టికల్చర్ మిషన్ ను ప్రారంభిస్తున్నట్లు తెలిపారు సీఎం నారా చంద్రబాబు నాయయుడు. దాదాపు లక్ష కోట్ల పెట్టుబడులు ఈ రంగంలో రానున్నాయని పేర్కొన్నారు. పరిశోధన కూడా ముఖ్యమేనని హైదరాబాద్లో ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ ఉన్నట్లే, ఆంధ్రప్రదేశ్లో ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ ను అభివృద్ధి చేయాలని అనుకుంటున్నట్లు చెప్పారు. అదే నమూనాను వ్యవసాయ రంగానికి అనుసరిస్తున్నాం అని తెలిపారు. అందువల్ల తమ దృష్టిలో హార్టికల్చర్ నుంచి అగ్రికల్చర్, ఆక్వాకల్చర్ నుంచి క్వాంటమ్ వరకు.. మొత్తం 23 రంగాలు ముఖ్యమైనవేనని పేర్కొన్నారు.
2047 నాటికి సాధారణ ఏపీ పౌరుడి జీవితం ఎలా ఉంటుందనే ప్రశ్నకు సమాధానం ఇస్తూ.. ఒక తరంలోనే మనం పేదరికాన్ని నిర్మూలించ గలమని నా నమ్మకం. ఒక తరం అంటే దాదాపు ఒక దశాబ్దం. ఒక దశాబ్దం పాటు స్థిరమైన, నిరంతరాయమైన ప్రభుత్వం ఉంటే పేదరికాన్ని నిర్మూలించగలం అన్నారు నారా లోకేష్. ఏపీలో మా ఏకైక ప్రధాన లక్ష్యం ఉద్యోగాల కల్పన. అదే మా సింగిల్ అజెండా అని మంత్రి పునరుద్ఘాటించారు. ఈ కార్యక్రమంలో గోద్రేజ్ ఇండస్ట్రీస్ గ్రూప్ కార్పోరేట్ అఫైర్స్ గ్రూప్ ప్రెసిడెంట్ రాకేష్ స్వామి, వివో మొబైల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ప్రెసిడెంట్ అర్జిత్ సేన్, సెల్ కాన్ గ్రూప్ ఫౌండర్, డైరెక్టర్ ఆర్.మురళీకృష్ణ, డీజీఏ గ్రూప్ పార్టనర్ అండ్ హెడ్ ఆఫ్ ఇండియా ఆఫీస్ సునీతా పట్నాయక్ తదితరులు పాల్గొన్నారు.


















