Home Minister Anitha : ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి వంగలపూడి అనిత సోమవారం మీడియాతో మాట్లాడుతూ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్‌మోహన్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు దిగజారిపోతున్నాయన్న భావన కలుగుతోందని ఆమె పేర్కొన్నారు. ప్రజల సమస్యలను పరామర్శించేందుకు వెళ్లిన జగన్, దాన్ని రోడ్‌షోలా మలచడాన్ని తప్పుబట్టారు.
Home Minister Anitha Shocking Comments on YS Jagan
జగన్‌కు (YS Jagan) ప్రభుత్వం అందించిన జడ్‌ప్లస్ భద్రత ఉన్నా, తాను భద్రతను పట్టించుకోక పోవడం బాధాకరమని అనిత (Home Minister Anitha) అన్నారు. ఆయన వాహనం కింద ఓ వ్యక్తి సీరియస్ గాయాలపాలవడం, తరువాత మృతిచెందడం తీవ్ర విచారం కలిగిస్తోందని, అయితే ఈ ఘటనపై జగన్ నిర్లక్ష్యంగా వ్యవహరించారని విమర్శించారు. బాధితుడిని సమయానికి ఆసుపత్రికి తరలిస్తే ప్రాణాలు నిలిచేవని ఆమె అభిప్రాయపడ్డారు.
దళిత వ్యక్తి మరణించినా స్పందించకపోవడమే కాదు, వైసీపీ కార్యకర్తలే ఆ ఘటనను సమర్థిస్తున్నట్టుగా మాట్లాడుతున్నారని అనిత ఆరోపించారు. పరామర్శ పేరుతో బలప్రదర్శన చేయడం, పక్కా ప్రణాళికతో హింసను రెచ్చగొట్టేలా వ్యవహరించడం సరికాదని స్పష్టం చేశారు.
వైసీపీ కార్యకర్తలు చేతుల్లో పార్టీ జెండా, మరో చేతిలో ఆయుధాలు పట్టుకుని కనిపించడం ఆందోళన కలిగించే విషయం అని అనిత తెలిపారు. సినిమా డైలాగ్‌లను ప్రదర్శిస్తూ రెచ్చగొట్టేలా వ్యవహరించడాన్ని న్యాయంగా ఎలా చూస్తారని ప్రశ్నించారు. ఈ పరిస్థితుల్లో నాయకులు బాధ్యతగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆమె హితవు పలికారు.
జగన్ తాను రోడ్ షోకు వెళ్లిన ప్రాంతాల్లో ఇద్దరు ప్రాణాలు కోల్పోయినా, తన కార్యక్రమాన్ని ఆపకపోవడం దుర్మార్గమని హోంమంత్రి విమర్శించారు. ప్రజల ప్రాణాలకంటే రాజకీయ లబ్ధికే ప్రాధాన్యత ఇవ్వడం బాధాకరమని ఆమె పేర్కొన్నారు. జగన్ సీఎం పదవిని పొందాలనే తపనలో మానవత్వాన్ని విస్మరిస్తున్నారని వ్యాఖ్యానించారు.
చంద్రబాబు, లోకేష్ పర్యటనలతో పోలిస్తే జగన్ వ్యవహారం భిన్నంగా ఉందని పేర్కొన్న అనిత, గతంలో టీడీపీ నాయకులపై అనేక ఆంక్షలు విధించారని గుర్తుచేశారు. కందుకూరులో జరిగిన తొక్కిసలాట ఘటనపై చంద్రబాబు ఎలా స్పందించారో గుర్తుచేసుతూ, బాధితులను పరామర్శించిన విధానం జగన్‌కు ఆదర్శంగా ఉండాలన్నారు.
Also Read : Nara Lokesh Invite New : చదువుకున్న వాళ్ళు రాజకీయాల్లోకి వస్తేనే అభివృద్ధి సాధ్యం
















