Home Minister Anitha : అమరావతి : ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరికి అరుదైన పురస్కారం లభించింది. ఆమె గత కొన్ని ఏళ్లుగా ప్రజా సేవలో నిమగ్నం అవుతూ వస్తున్నారు. ఓ వైపు కోడలు నారా బ్రాహ్మణి హెరిటేజ్ కంపెనీని చూసుకుంటున్నారు. ఇందులో భువనేశ్వరి డైరెక్టర్ గా ఉన్నారు. ఇదిలా ఉండగా ఆదివారం సామాజిక సేవలో సామాన్యులకు విశేష సేవలందిస్తూ సమున్నత శిఖరాలకు చేరేందుకు ప్రయత్నం చేస్తున్న నారా భువనేశ్వరికి అరుదైన పురస్కారం లభించింది. ఇనిస్టిట్యూట్ ఆఫ్ డైరెక్టర్స్ (IOD) 2025 సంవత్సరానికి అందించే డిస్టింగ్విష్డ్ ఫెలోషిప్ అవార్డుకు ఎంపికయ్యారు. ఈ విషయాన్ని సంస్థ అధికారికంగా వెల్లడించింది సామాజిక మాధ్యమం వేదికగా.
AP Home Minister Anitha Key Update
ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా తలసేయమియా బాధితుల సంక్షేమం కోసం కృషి చేస్తున్నారు. ఇదొక్కటే కాకుండా
మరెన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ సామాజిక సాధికారతకు పాటు పడుతున్నారు. తనకు ఇంటర్నేషనల్ స్థాయిలో గుర్తింపు రావడం పట్ల రాష్ట్రానికి చెందిన మంత్రులు స్పందించారు. ఆమెను అభినందనలతో ముంచెత్తారు. తాజాగా రాష్ట్ర హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత (Home Minister Anitha) నారా భువనేశ్వరిని ప్రశంసలతో ముంచెత్తారు. సామాజిక సేవలతో నిరంతరం బిజీగా ఉన్న తనకు ఇంతటి అత్యున్నత గౌరవం దక్కడం తెలుగు మహిళలుగా మా అందరికీ గర్వ కారణంగా ఉందన్నారు అనిత వంగలపూడి. మీ స్ఫూర్తితో మరెంతో మంది సమాజసేవ వైపు అడుగులేస్తూ సమ సమాజ స్థాపనకు కృషి చేయడం అభినందనీయం అని పేర్కొన్నారు.భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలకు ఎదగాలని కోరుకుంటూ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.
Also Read : TG Govt Important Visit to SC : బీసీ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టుకు సర్కార్
















