సీఎం విజ‌య్ తో హిందూజా గ్రూప్ ప్రతినిధుల భేటీ

పునరుత్పాదక ఇంధన పెట్టుబడుల పెంపుపై చర్చ

hellotelugu-CMVijay

లండ‌న్ : లండ‌న్ ప‌ర్య‌ట‌న‌లో బిజీగా ఉన్నారు త‌మిళ‌నాడు సీఎం జోసెఫ్ విజ‌య్ చంద్ర‌శేఖ‌ర్. ఆయ‌నను ప‌లు సంస్థ‌లు, కంపెనీల ప్ర‌తినిధులు, సీఈఓలు, చైర్మ‌న్లు క‌లుస్తున్నారు. ఇవాళ లండ‌న్ వేదిక‌గా ప్ర‌త్యేకించి త‌న అభిమానుల‌తో భేటీ కావాల్సి ఉంది. కానీ భ‌ద్ర‌తా కార‌ణాల రీత్యా లండ‌న్ సిటీ పోలీసులు అనుమ‌తి నిరాక‌రించారు. దీంతో ఈ ప‌ర్య‌ట‌న‌ను ర‌ద్దు చేసుకోవాల్సి వ‌చ్చింద‌ని తెలిపారు సీఎం టీం. ఇదిలా ఉండ‌గా త‌న ప‌ర్య‌ట‌న‌లో భాగంగా కీల‌క ప‌రిణామం చోటు చేసుకుంది. లండన్‌లో ముఖ్యమంత్రితో హిందూజా గ్రూప్ ప్రతినిధుల భేటీ అయ్యారు. ఈ కీల‌క స‌మావేశం అత్యంత ప్రాధాన్య‌త సంత‌రించుకుంది. తమిళనాడులో పెట్టుబడులను కొనసాగించడానికి , వ్యాపార కార్యకలాపాలను విస్తరించడానికి తమ నిబద్ధతను ఆ గ్రూప్ పునరుద్ఘాటించింది.

ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్‌తో జరిగిన సమావేశంలో హిందూజా గ్రూప్ తమిళనాడులో తమ ప్రస్తుత వ్యాపార కార్యకలాపాలను విస్తరించడంతో పాటు, పునరుత్పాదక ఇంధన రంగంలో (ముఖ్యంగా పవన విద్యుత్) పెట్టుబడులను పెంచడానికి ఆసక్తిని వ్యక్తం చేసింది. అశోక్ లేలాండ్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ ధీరజ్ హిందూజా, ఫినోలెక్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ ప్రకాష్ పి. ఛబ్రియా, డైరెక్టర్ రీటా హిందూజా ఛబ్రియా ముఖ్యమంత్రిని కలిశారు. సమావేశంలో, ఆగస్టు 2026లో జరిగిన ‘వెట్రి తమిళనాడు ఇన్వెస్టర్స్ మీట్’లో కుదుర్చుకున్న రూ. 2,500 కోట్ల విలువైన అవగాహన ఒప్పందం ఆధారంగా తీసుకుంటున్న చర్యలు , తమిళనాడులో హిందూజా గ్రూప్ పెట్టుబడుల పురోగతి గురించి ధీరజ్ హిందూజా ముఖ్యమంత్రికి వివరించారు.

తమిళనాడులో పెట్టుబడులను కొనసాగించడానికి, వ్యాపార కార్యకలాపాలను విస్తరించడానికి తమ నిబద్ధతను ఆ గ్రూప్ పునరుద్ఘాటించిందని, అదే సమయంలో పునరుత్పాదక ఇంధన రంగంలో, ముఖ్యంగా పవన విద్యుత్ రంగంలో పెట్టుబడులను పెంచడానికి ఆసక్తిని కనబరిచిందని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. తమిళనాడులో తయారైన వాణిజ్య వాహనాల ఎగుమతులను పెంచడం , ఆటోమొబైల్ తయారీ రంగానికి ఎగుమతి కేంద్రంగా రాష్ట్ర స్థానాన్ని బలోపేతం చేసే చర్యలపై కూడా చర్చలు జరిగాయి.

Exit mobile version