బీసీ బిడ్డలకు ఉన్నత విద్యే లక్ష్యం : సవిత

భారీ ఎత్తున నిధులు మంజూరు చేశాం

helotelugu-SSavitha

అమ‌రావ‌తి : రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బీసీ బిడ్డలకు ఉన్నత విద్య అందించాలన్నదే సీఎం చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత తెలిపారు. బీసీ హాస్టళ్లు, గురుకులాల అభివృద్ధికి గతంలో ఎన్నడూ లేనంతగా నిధులు మంజూరు చేస్తున్నామన్నారు. సన్న బియ్యం భోజనంతో కూడిన మెనూ అమలు చేస్తూ, నాణ్యమైన ఆహారం అందిస్తున్నామన్నారు. పరిశుద్ధమైన తాగునీరు అందించడానికి ఆర్వో ప్లాంట్లు ఏర్పాటు చేశామన్నారు. మరుగుదొడ్లు పరిశుభ్రంగా ఉండేలా పారిశుధ్య సిబ్బందిని, రుచికరమైన భోజనం అందించడానికి కుక్ లు, కమాటీలను నియమించామన్నారు. తరగతి గదులు, విశ్రాంతి గదుల్లోకి దోమలు చొరబడకుండా ఉండేలా దోమ తెరలు ఏర్పాటు చేశామన్నారు.

టెన్త్, ఇంటర్ లో మెరుగైన ఫలితాలు సాధించడానికి నిష్ణాతులైన ఉపాధ్యాయుల బోధనలతో పాటు మెటీరియల్ అందజేస్తున్నామన్నారు స‌విత‌. హాస్టళ్లు, గురుకులాల ద్వారా బీసీ బిడ్డలకు ఆరోగ్య, ఆహార భద్రతతో కూడిన విద్య అందిస్తున్నామన్నారు. నియోజక వర్గంలో బీసీ బిడ్డలెవరూ బడి బయట ఉండకూడదనే లక్ష్యంతో, పరిగి, రొద్దం, సోమందేపల్లిలో బీసీ హాస్టళ్లను ఏర్పాటు చేస్తున్నామన్నారు. బీసీ హాస్టళ్లలో చదివే విద్యార్థులకు తల్లికి వందనం, విద్యామిత్ర కిట్లు అందజేస్తామన్నారు. విద్యతోనే ఉన్నత స్థానాలకు చేరుకోవొచ్చని, బీసీ సామాజిక వర్గానికి చెందిన తల్లిదండ్రులు తమ బిడ్డను బడిలో చేర్పించాలని కోరారు. విద్యార్థులను కంటికి రెప్పలా కాపాడుకుంటూ, వారికి విద్యతో పాటు ఆరోగ్య, రక్షణ భద్రత కల్పిస్తామని మంత్రి సవిత తెలిపారు.

Exit mobile version