హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ పై. ఆయన నిర్వాకం, పనితీరు బాగోలేదంటూ మండిపడింది ధర్మాసనం. ప్రైవేట్ భూమిలో ఫెన్సింగ్ ఎలా వేస్తారంటూ ప్రశ్నించింది. ఫెన్సింగ్ తీసేవరకు బాధితులకు రోజుకు రూ.1 లక్ష జరిమానా చెల్లించాలని ఆదేశించింది కోర్టు. ఉప్పల్ – మల్లాపూర్‌లోని భాభానగర్ సొసైటీలో రెండు 500 చదరపు గజాల ప్రైవేట్ ప్లాట్లకు కంచె వేసింది. దీనిపై హైకోర్టులో పిటిషన్ వేశారు ప్లాట్ల యజమానులు. దీనిపై విచారణ జరిపింది కోర్టు. ఈ సందర్బంగా కంచెను వెంటనే తొలగించాలని ఆదేశించింది. ఇందుకు సంబంధించి జరిమానా విధిస్తున్నట్లు షాక్ ఇచ్చింది.
ఓ వైపు హైడ్రా పేరుతో తెలంగాణ సర్కార్ రియల్ ఎస్టేట్ దందా చేస్తోందంటూ తీవ్ర ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటికే హైకోర్టు పలు సందర్భాలలో ఏవీ రంగనాథ్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. తన పనితీరు మార్చు కోవాలని లేక పోతే కఠిన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఎవరైనా , ఏ స్థాయిలో ఉన్నా సరే భారత రాజ్యాంగానికి, చట్టానికి లోబడి ఉండాల్సిందేనని, నువ్వు సుప్రీం అనుకుంటే ఎలా అని ప్రశ్నించింది ఒకానొక సమయంలో కోర్టు ధర్మాసనం. ఈ ఒక్కటే కాదు పలు సందర్భాలలో హైకోర్టు రంగనాథ్ ను చీవాట్లు పెట్టింది.
