Hero Vishnu-Kannappa : మంచు విష్ణు కన్నప్ప సినిమాపై తలైవా ప్రశంసలు

మంచు విష్ణుపై ప్రశంసలు కురిపించారు...

Hello Telugu - Hero Vishnu-Kannappa

Hello Telugu - Hero Vishnu-Kannappa

Kannappa : మంచు మోహన్ బాబు – సూపర్ స్టార్ రజినీకాంత్ ఎంత మంచి స్నేహితులో అందరికీ తెల్సిందే. మోహన్ బాబు ఏడాదిలో రెండు మూడుసార్లు అయినా రజినీకాంత్ ను కలుస్తూ ఉంటాడు. తలైవా సైతం హైదరాబాద్ వచ్చిన ప్రతిసారి మోహన్ బాబు ఇంటికి వచ్చి వెళ్తూనే ఉంటాడు. తాజాగా మంచు మోహన్ బాబు, విష్ణు కలిసి రజినీకాంత్ ను మీట్ అయ్యారు. మంచు విష్ణు హీరోగా మోహన్ బాబు నిర్మించిన కన్నప్ప సినిమాను దగ్గరుండి రజినీకాంత్ కు చూపించారు. రజినీకాంత్, ఆయన సతీమణి లతాతో కలిసి కన్నప్ప సినిమాను ను వీక్షించి.. మంచు విష్ణుపై ప్రశంసలు కురిపించారు.

Manchu Vishnu – Kannappa Movie Updates

ఇక ఈ విషయాన్నీ మంచు విష్ణు (Manchu Vishnu) సోషల్ మీడియా వేదికగా తెలుపుతూ ఎమోషనల్ అయ్యాడు. ” గతరాత్రి రజినీకాంత్ అంకుల్.. కన్నప్ప సినిమా చూసారు. సినిమా అయ్యిపోయాక ఆయన నన్ను గట్టిగా హత్తుకొని.. సినిమా చాలా బాగా నచ్చిందని చెప్పారు. ఒక నటుడిగా ఈ హాగ్ కోసం 22 ఏళ్లుగా ఎదురుచూశాను. ఈరోజు నేను ఎంతో సంతోషంగా ఫీల్ అవుతున్నాను. నన్ను ఎంకరేజ్ చేసినట్లు అనిపిస్తుంది. కన్నప్ప జూన్ 27న వస్తోంది. ప్రపంచం శివుని మాయాజాలాన్ని అనుభూతి చెందేలా చేయడానికి నేను ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను” అంటూ చెప్పుకొచ్చాడు. ఇక సినిమా తరువాత రజినీకాంత్, మోహన్ బాబు కలిసి కేక్ కట్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.

గత కొన్నేళ్లుగా మంచు విష్ణు ఒక మంచి సినిమా కోసం ఎదురుచూస్తున్న విషయం తెల్సిందే. మంచు కుటుంబంపై ఉన్న నెగిటివిటీ వలన విష్ణు నటించిన ఏ సినిమా కూడా ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయింది. ఇక ఈసారి ఎలాగైనా హిట్ అందుకోవాలన్న పట్టుదలతో విష్ణు కన్నప్పను మొదలుపెట్టాడు. ప్రభాస్, మోహన్ లాల్, అక్షయ్ కుమార్, కాజల్ ఇలా స్టార్స్ మొత్తం ఈ సినిమాలో నటిస్తున్నారు. ఈమధ్యనే రిలీజ్ అయిన కన్నప్ప ట్రైలర్ మంచి పాజిటివ్ టాక్ ను తెచ్చుకోవడంతో సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. మరి కన్నప్పతో మంచి విష్ణు ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.

Also Read : Hero Suhas : మరో సరికొత్త సినిమాతో అలరించనున్న కలర్ ఫోటో హీరో ‘సుహాస్

Exit mobile version