Hero Rishab Shetty-Kantara 2 : కాంతార 2 మరణాలపై హీరో ను హెచ్చరించిన పూజారి

అయితే పడవ ప్రయాణంలో ఎవరికీ ఏమీ కాలేదు...

Hello Telugu - Hero Rishab Shetty-Kantara 2

Hello Telugu - Hero Rishab Shetty-Kantara 2

Kantara 2 : రిషబ్‌ శెట్టి నటిస్తూ, దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘కాంతార చాప్టర్‌ 1’. 2022లో వచ్చిన ‘కాంతార’ చిత్రానికి ప్రీక్వెల్‌గా ఈ సినిమా రూపొందుతోంది. చిత్రీకరణ ప్రారంభించి చాలా కాలమైంది. కానీ సెట్‌లో ఏదో ఒక ప్రమాదం జరగడం, ఆటంకాలు ఏర్పడటం జరుగుతోంది. ఇప్పటికే పలు కారణాలతో సెట్‌లో జూనియర్‌ ఆర్టిస్టు కపిల్‌, నటుడు రాకేశ్‌ పూజారి, మిమిక్రీ కళాకారుడు నిజు వీకే ఆకస్మికంగా మరణించారు. తాజాగా శనివారం రాత్రి షూటింగ్‌ చేస్తున్న పడవ మునిగిపోయింది. అయితే పడవ ప్రయాణంలో ఎవరికీ ఏమీ కాలేదు. ఆ సమయంలో రిషబ్‌ కూడా అక్కడే ఉన్నారు. అంతకుముందు కేరళకు చెందిన ఎంఎఫ్‌ కపిల్‌ జూనియర్‌ ఆర్టిస్టుగా కాంతారా చాప్టర్‌ 1లో నటిస్తున్నాడు. ఉడుపి జిల్లా కొల్లూరు వద్ద ఉన్న సౌపర్ణికా నదిలో కపిల్‌ ఈత కొడుతూ మునిగి చనిపోయాడు.

Kantara 2 Shocking Updates

హాస్యనటుడు రాకేశ్‌ పూజారికి ఈ సినిమాలో అవకాశం వచ్చింది. అయితే మే 12న ఉడుపి లో ఓ పెళ్లి వేడుకలో గుండెపోటుతో హఠాత్తుగా మరణించారు. హీరో రిషబ్‌ శెట్టి (Rishab Shetty) ఆయన అంత్యక్రియలకు కూడా హాజరు కాలేదని రాకేశ్‌ ఆత్మీయులు ఆవేదన వ్యక్తం చేశారు. ఆ తర్వాత నెల రోజులకు అంటే జూన్‌ 12న ఇదే సినిమాలో నటిస్తున్న కేరళకు చెందిన మిమిక్రీ కళాకారుడు నిజు వికే మరణించాడు. ఆగుంబే హోం ేస్టలో నిజు విశ్రాంతి తీసుకుంటూ గుండెపోటుతో కన్నుమూశాడు. అలాగే గతేడాది నవంబర్‌లో కొల్లూరు మార్గంలో యూనిట్‌ సభ్యులతో వెళ్తున్న మినీ బస్‌ ప్రమాదానికి గురైంది. 20 మంది జూనియర్‌ ఆర్టిస్టులు గాయపడ్డారు. అయితే ప్రాణాపాయం జరగలేదు. అలాగే కుందాపుర వద్ద వేసిన భారీ సెట్‌ సుడిగాలి కారణంగా ధ్వంసం అయింది. కోటి రూపాయల ఆస్తి నష్టం జరిగింది. అలాగే హాసన్‌జిల్లా హెరూరు గ్రామ శివార్లలోని అటవీ ప్రాంతంలో గోమాళ స్థలంలో ఈ సినిమా షూటింగ్‌ జరుగుతున్నప్పుడు వివాదం జరిగింది. షూటింగ్‌ కోసం అడవులను నాశనం చేస్తున్నారని, పేలుళ్లు జరిపారని స్థానికులు ఽఅటవీశాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు.

జరుగుతున్న ప్రమాదాలు, ఆస్తి నష్టం, ప్రాణ నష్టాలను గమనించి రిషబ్‌ శెట్టి (Rishab Shetty) అర్చకులను సంప్రదించారు. కొన్ని రోజుల క్రితం కద్రి బారైబెల్‌ వారాహి పంజుర్లి, జారందాయ దైవం ఉత్సవంలో పాల్గొన్న ఆయనను అక్కడి పూజారులు హెచ్చరించారట. ునీ కార్యం సఫలం కాకుండా పాడు చేసేందుకు పథకాలు నడుస్తున్నాయి’ అని పూజారులు పేర్కొన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ సినిమాను అక్టోబర్‌ 2న విడుదల చేయాలని రిషబ్‌ అహర్నిశలు కష్టపడుతున్నారు.

Also Read : Beauty Rakul Preet Singh : రామాయణ సినిమాలో రకుల్ డి శూర్పణఖ పాత్రా..?

Exit mobile version