Thug Life : కర్ణాటకలో “థగ్‌లైఫ్” సినిమా విడుదలపై వివాదం నడుస్తున్న నేపథ్యంలో, ఈ సినిమాను అడ్డుకునేందుకు పలు పిటిషన్‌లు దాఖలయ్యాయి. ఈ పిటిషన్‌లు శుక్రవారం ఒకే రోజు సుప్రీంకోర్టు మరియు కర్ణాటక హైకోర్టులో విచారణకు వచ్చాయి. “థగ్‌లైఫ్” (Thug Life) సినిమా హీరో కమల్ హాసన్ ఇటీవల బెంగళూరులో జరిగిన ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో చేసిన వ్యాఖ్యలు కర్ణాటకలో తీవ్ర ప్రతికూలతకు దారితీశాయి. ఆయన చేసిన వ్యాఖ్యలు కన్నడ భావోద్వేగాలను దెబ్బతీసేలా ఉన్నాయని పలువురు భావించారు.
Kamal Haasan-Thug Life Movie Updates
ఈ వ్యాఖ్యలపై కమల్ హాసన్ క్షమాపణ చెప్పాలని, లేకపోతే సినిమా విడుదలను అడ్డుకుంటామని కన్నడ సంఘాలు హెచ్చరించాయి. కర్ణాటక చలనచిత్ర వాణిజ్య మండలి కూడా ఈ వివాదంపై స్పందిస్తూ సినిమా విడుదలపై ఆంక్షలు విధించేలా తీర్మానం చేసింది.
ఈ పరిణామాల నేపథ్యంలో, సినిమా విడుదలపై ఉన్న అడ్డంకులను తొలగించేందుకు థగ్‌లైఫ్ సినిమా నిర్మాణ సంస్థ నేరుగా సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ పిటిషన్‌పై న్యాయమూర్తులు జస్టిస్ ప్రశాంత్‌కుమార్ మిశ్రా మరియు జస్టిస్ మన్మోహన్ లతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. కేసులో కర్ణాటక ప్రభుత్వం స్పందించాల్సిందిగా సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను జూన్ 17వ తేదీకి వాయిదా వేసింది. ఈ కేసు చుట్టూ మరోసారి కళా స్వేచ్ఛ, రాష్ట్ర ఆవేశాలు మరియు అభివ్యక్తి స్వాతంత్ర్యానికి సంబంధించిన చర్చలు తెరపైకి వచ్చాయి.
Also Read : Fatima Sana Shaik Shocking : దంగల్ నటి ఫాతిమా సంచలన వ్యాఖ్యలు

















