Hero Dhanush-Kubera : కుబేర ప్రీ రిలీజ్ ఈవెంట్ జూన్ 15 కు మార్చిన నిర్మాత

శేఖర్‌ కమ్ముల దర్శకత్వంలో సునీల్‌ నారంగ్‌, పుస్కుర్‌ రామ్‌మోహన్‌రావు ఈ చిత్రాన్ని నిర్మించారు...

Hello Telugu - Hero Dhanush-Kubera

Hello Telugu - Hero Dhanush-Kubera

Kubera : ధనుష్‌ హీరోగా శేఖర్‌ కమ్ముల రూపొందించిన చిత్రం ‘కుబేర’. రష్మిక మందన్నా కథానాయిక. నాగార్జున కీలక పాత్రలో నటించారు. త్వరలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది సినిమా. ప్రమోషన్స్‌లో భాగంగా శుక్రవారం ఈ సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ హైదరాబాద్‌లో నిర్వహించాలని టీమ్‌ షెడ్యూల్‌ చేసుకుంది. అయితే గురువారం అహ్మదాబాద్‌లో జరిగిన ఎయిరిండియా విమాన ప్రమాదం దృష్ట్యా ఆ ఈవెంట్‌ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. తాజాగా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కు సంబంధించిన కొత్త డేట్‌ను ప్రకటించారు మేకర్స్‌. జూన్‌ 15, ఆదివారం సాయంత్రం ఈ కార్యక్రమం ముందు అనుకున్నట్లుగానే హైదరాబాద్‌లో నిర్వహించనున్నట్లు తెలిపారు. శేఖర్‌ కమ్ముల దర్శకత్వంలో సునీల్‌ నారంగ్‌, పుస్కుర్‌ రామ్‌మోహన్‌రావు ఈ చిత్రాన్ని నిర్మించారు.

Kubera Movie Updates

‘‘ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడైన వ్యక్తికి.. వీధుల్లో జీవించే ఓ అతి పేదవాడికి మధ్య జరిగే సంఘర్షణే ఈ చిత్ర ప్రధాన ఇతివృత్తం. ఇందులో హవాలా, మనీలాండరింగ్‌ తదితర అంశాలు మిళితమై ఉంటాయి. ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రాన్ని ఈ నెల 20న విడుదల కానుంది.

Also Read : Kollu Ravindra Shocking : పేర్ని నాని అరెస్ట్ భయంతోనే నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారు

Exit mobile version