Telangana Heavy Rains Shocking : వ‌ర్ష బీభ‌త్సం తెలంగాణ అత‌లాకుత‌లం

ప‌లు చోట్ల ట్రాఫిక కు అంత‌రాయం

Hello Telugu - Telangana Heavy Rains Shocking

Hello Telugu - Telangana Heavy Rains Shocking

Heavy Rains : హైద‌రాబాద్ – బంగాళా ఖాతంలో చోటు చేసుకున్న అల్ప పీడ‌నం కార‌ణంగా అటు ఏపీలో ఇటు తెలంగాణ రాష్ట్రాల‌ను వ‌ర్షాలు ముంచెత్తాయి. పెద్ద ఎత్తున ఎడ తెరిపి లేకుండా కురుస్తుండ‌డంతో (Heavy Rains) జ‌న జీవ‌నం స్తంభించి పోయింది. ప్రాజెక్టులు నీళ్ల‌తో క‌ళ క‌ళ లాడుతున్నాయి. చెరువులు, కుంట‌లు, కాల్వలు అలుగు పారుతున్నాయి. ఆయా ప్రాంతాల‌లో రెడ్ అలర్ట్ ను ప్ర‌క‌టించారు. అవ‌స‌ర‌మైతే త‌ప్పా బ‌య‌ట‌కు రావ‌ద్ద‌ని ఆయా జిల్లాల క‌లెక్ట‌ర్లు హెచ్చ‌రించారు. చాలా చోట్ల ర‌హ‌దారుల‌న్నీ జ‌ల‌మ‌యం కాగా మ‌రికొన్ని చోట్ల ఇళ్లు ధ్వంసం అయ్యాయి. ములుగు పూర్తిగా నీళ్ల‌లో నిండి పోయింది.

Heavy Rains in Telangana

వ‌ర్షాలు కురుస్తూ ఉండ‌డంతో భూపాలపల్లి, మహబూబాబాద్, ములుగు, రంగారెడ్డి, వికారాబాద్, వరంగల్, హన్మకొండ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్ర‌క‌టించారు ఆయా జిల్లాల క‌లెక్ట‌ర్లు. స‌హాయ‌క చ‌ర్య‌లు చేప‌ట్టాల‌ని ఆదేశించారు. రాబోయే రెండు రోజులు అల్ప పీడనం మ‌రింత పెరిగే అవ‌కాశం ఉంద‌ని, గంటకు 41-61 కి.మీ వేగంతో గాలులు వీస్తాయ‌ని హెచ్చ‌రించింది వాతావ‌ర‌ణ శాఖ‌.

ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, హైదరాబాద్, జగిత్యాల, జనగాం, జోగులాంబ గద్వాల్, కామారెడ్డి, కరీంనగర్, ఖమ్మం, కొమరం భీమ్ ఆసిఫాబాద్, మహబూబ్ నగర్, మంచిర్యాల, మెదక్, మేడ్చల్ మల్కాజిగిరి, నాగర్ కర్నూల్, నల్గొండ, నారాయణపేట, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి రాజన్న సిరిసిల్ల, సంగారెడ్డి, సిద్ధిపేట, సూర్యాపేట, వనపర్తి, యాదాద్రి భువనగిరి జిల్లాలలో తేలికపాటి నుండి మోస్తరు వర్షం కురిసే ఛాన్స్ ఉంద‌ని పేర్కొంది. ములుగు జిల్లాలోని వెంకటాపురంలో అత్యధికంగా 227 మి.మీ వర్షపాతం నమోదు అయ్యింది. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చ‌రించింది.

Also Read : Minister Anam Alarming : ఆల‌యాల‌కు పూర్వ వైభవం తీసుకు వ‌స్తాం

Exit mobile version