Telangana : హైదరాబాద్ : తెలంగాణ వాతావరణ శాఖ కీలక ప్రకటన చేసింది. భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. సెప్టెంబర్ 26, 27 తేదీల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు వస్తాయని తెలిపింది. అనేక జిల్లాల్లో 20 సెం.మీ వరకు విస్తృత వర్షపాతం ఉంటుందని హెచ్చరించింది. మరో వైపు హైదరాబాద్ ను వర్షాలు ముంచెత్తుతున్నాయి. ఎడ తెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. నగరాన్ని ఇటీవల వరుసగా వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. కుండ పోత వర్షంతో నగరవాసులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఎక్కడ చూసినా ట్రాఫిక్ జామ్ ఏర్పడుతోంది.
Telangana Weather Heavy Rains Warning
బంగాళాఖాతంలో ఏర్పడిన తుఫాను వ్యవస్థ కారణంగా రెండు రోజుల పాటు తెలంగాణ (Telangana) అంతటా భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. 25న అల్పపీడనం ఏర్పడుతుందని, 26 నాటికి తుఫానుగా మారవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ వ్యవస్థ 27న దక్షిణ ఒడిశా, ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ మధ్య తీరం దాటే అవకాశం ఉందని పేర్కొంటున్నారు.
26న ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భోంగిర్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో 10 సెంటీమీటర్ల నుంచి 20 సెంటీమీటర్ల వరకు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని స్పష్టం చేసింది. మరో వైపు 27న ఆదిలాబాద్, కుమురం భీమ్ ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.
Also Read : Deputy CM Pawan Important Comments : ఉప్పాడ మత్స్యకారుల సమస్యలు పరిష్కరిస్తా
















