హ‌స‌రంగా , నార్జే ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ కైవ‌సం

వేలం పాట‌లో వ్యూహాత్మ‌కంగా వ్య‌వ‌హ‌రించాం

hellotelugu-WaninduHasarangaLSg

దుబాయ్ : ఐపీఎల్ మినీ వేలం 2026లో ఆస‌క్తికర ప‌రిణామాలు చోటు చేసుకున్నాయి. అత్య‌ధిక ధ‌ర‌కు కామెరాన్ గ్రీన్ అమ్ముడు పోయాడు. ఇక ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ కావాల‌ని శ్రీ‌లంక‌కు చెందిన హ‌స‌రంగాతో పాటు నార్జేను తీసుకుంది. ఈ సంద‌ర్బంగా ఎల్ఎస్జీ ఫ్రాంచైజీ ఓన‌ర్ సంజీవ్ గోయెంకా ఈ ఇద్ద‌రి ఆట‌గాళ్ల‌ను తీసుకోవ‌డంపై స్పందించారు. వేలం ఫలితాన్ని బాగా ప్రణాళికా బద్ధమైన, ఆలోచనాత్మక వ్యూహం ఫలితంగా అభివర్ణించారు. బిడ్డింగ్ ఎలా జరిగిందో దానిపై మొత్తం సంతృప్తిని వ్యక్తం చేశారు. త‌మ ఫ్రాంచైజీ స్పష్టమైన లక్ష్యాలను కలిగి ఉందన్నాడు. క్రమశిక్షణతో కూడిన బిడ్డింగ్ విధానాన్ని అనుసరించిందని స్ప‌ష్టం చేశాడు సంజీవ్ గోయెంకా.

మా ప్లాన్ ఒక్క‌టే. ఈసారి టోర్నీలో జ‌ట్టుకు ఎవ‌రు కీల‌క‌మైన అవ‌స‌రంగా మారుతారో వారి పైనే ఈ వేలంపాట‌లో ఎక్కువ‌గా ఫోక‌స్ పెట్టామ‌న్నారు. ప్ర‌ధానంగా నాణ్యమైన అంతర్జాతీయ లెగ్-స్పిన్నర్ తో పాటు ఇంట‌ర్నేష‌న‌ల్ ఫాస్ట్ బౌల‌ర్ కావాల్సి ఉంది. అందుకే త‌మ ఫ‌స్ట్ ఛాయిస్ లెగ్ స్పిన్న‌ర్ గా గుర్తింపు పొందిన శ్రీ‌లంక ఆట‌గాడు వానిందు హ‌స‌రంగాను టేకోవ‌ర్ చేసుకున్నామ‌ని తెలిపాడు. అయితే ఫాస్ట్ బౌలింగ్ విష‌యానికి వ‌స్తే మ‌థీషా ప‌తిరానాతో పాటు అన్రిచ్ నార్జే మ‌ధ్య నెల‌కొంది. చివ‌ర‌కు తాము నార్టే వైపు మొగ్గు చూపామ‌న్నాడు సంజీవ్ గోయెంకా. ఈ ఇద్ద‌రు ఆట‌గాళ్ల‌ను పొంద‌డం ఆనందంగా ఉంద‌న్నాడు .

Exit mobile version