Akhanda 2 : బోయపాటి శ్రీను దర్శకత్వం వహిస్తున్న చిత్రం అఖండ-2 (Akhanda 2). దీనిపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాకు సంబంధించి రోజుకో అప్ డేట్ వస్తోంది. తాజాగా హిందీలో వచ్చిన మూవీ బజరంగ్ భాయిజాన్ చిత్రంలో నటించింది హర్షాలీ. 2021లో బ్లాక్ బస్టర్ అఖండ విడుదలైంది. బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఇక ఈ సీక్వెల్ మూవీలో తను జనని పాత్ర పోషించనుందని ప్రకటించారు మూవీ మేకర్స్. ఈ విషయం గురించి బుధవారం చిత్ర నిర్మాణ సంస్థ సామాజిక మాధ్యమం ఏక్స్ వేదికగా వెల్లడించింది.
Balakrishna Akhanda 2 Movie Updates
ఈ సందర్బంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది హర్షాలీ మల్హోత్రా. ఒక దేవదూత చిరునవ్వు కలిగిన హర్షాలీ మల్హోత్రా రానుందంటూ పేర్కొంది. తమ సినిమా అఖండ -2 మూవీని వచ్చే దసరా పండుగ సెప్టెంబర్ 25న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేస్తామంటూ ప్రకటించారు ఇప్పటికే నిర్మాతలు. సినిమాకు సంబంధించి పోస్టర్స్ దుమ్ము రేపుతున్నాయి. బాలయ్యను మరో రేంజ్ లో చూపించే ప్రయత్నం చేస్తున్నానంటూ ప్రకటించారు దర్శకుడు బోయపాటి శ్రీను.
ఇదిలా ఉండగా నందమూరి బాలకృష్ణ పుట్టిన రోజు సందర్బంగా పవర్ ఫుల్ టీజర్ ను రిలీజ్ చేశారు. ఇది పెద్ద ఎత్తున ఆదరణ చూరగొంది. రామ్ లక్ష్మణ్ లు అద్భుతంగా ఫైట్స్ ను రూపొందించారు. హై యాక్షన్ సన్నివేశాలు ఆకట్టుకునేలా ఉన్నాయి. సినిమాకు సంబంధించి టాప్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ఎస్ థమన్ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అఖండ 2 తాండవంకు ప్లస్ పాయింట్ గా మారింది.
Also Read : Hero Manchu Vishnu-Dil Raju : మంచు విష్ణు నిర్ణయం దిల్ రాజు సంతోషం

















