Harish Shankar : టాలీవుడ్ లో దమ్మున్న డైరెక్టర్ హరీశ్ శంకర్ (Harish Shankar). తను మాటలను అద్భుతంగా వాడతాడు. తను గతంలో పవన్ కళ్యాణ్ తో తీసిన గబ్బర్ సింగ్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. తాజాగా ఉస్తాద్ భగత్ సింగ్ తీస్తున్నాడు. ఈ ఏడాది రెండు సినిమాలు పవన్ కళ్యాణ్ కు చెందిన ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. జూలై 24న ఫిక్స్ చేశారు హరి హర వీరమల్లు మూవీ రిలీజ్ చేసేందుకు. ప్రముఖ నిర్మాత ఎంఎం రత్నం భారీ ఖర్చు పెట్టాడు. ఇదే మూవీతో పాటు సుజిత్ దర్శకత్వంలో ఓజీ రానుంది. ఈ రెండింటి సినిమాలపై అంచనాలు నెలకొన్నాయి. మంచి స్పందన వచ్చింది ఈ రెండింటికి.
Harish Shankar Movie Updates
ఏపీ డిప్యూటీ సీఎం గా ఉన్న పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఫుల్ ఫోకస్ పెట్టాడు ఉస్తాద్ భగత్ సింగ్ మూవీపై. ఇందులో కీలక పాత్ర పోషిస్తోంది అందాల ముద్దుగుమ్మ శ్రీలీల. ఇందుకు సంబంధించి షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది. చాలా కాలం తర్వాత ఈ మూవీస్ రానున్నాయి. ఈ మూవీని పూర్తిగా పవర్ స్టార్ మాస్ చిత్రంగా ప్రయత్నం చేస్తున్నాడు దర్శకుడు హరీశ్ శంకర్.
ఈ సినిమాకు సంబంధించి కీలక అప్ డేట్ వచ్చింది. ఇదిలా ఉండగా పవన్ కళ్యాణ్ పుట్టిన తేది సెప్టెంబర్ 2. ఇందులో భాగంగా పోస్టర్ లేదా గ్లింప్స్ ను రిలీజ్ చేయాలని రెడీ కానుంది. అదే రోజు ఓజీకి సంబంధించి కూడా సూపర్ ఝలక్ ఇచ్చేందుకు రెడీగా ఉన్నట్టు టాక్. ఇక ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం వహిస్తున్న సంగతి తెలిసిందే.
Also Read : Director Anil Ravipudi Warning : మెగాస్టార్ నయన్ మూవీ ప్రాజెక్టు లీక్స్ పై ఫైర్


















